మేం వేశాం.. మీరు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముందస్తు’ ఎన్నికలు ముగిసిపోయాయి. గద్దెపైకి ఎవరొస్తారన్న విషయాన్ని పక్కనపెడితే, ఎన్నికల పట్ల సమస్త ప్రజానీకం అనాసక్తతే చూపించారన్న విషయం పోలింగ్ శాతాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. గత నెల రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ సమీకరణలు, అధికార తెరాస పాలనను అడ్డుకోడానికి వివిధ పార్టీలతో ఏర్పాటైన కూటమి, పరస్పర వాగ్బాణాలతో నిర్వహించిన ప్రచార పటాటోపం.. ఈ హడావుడి అంతా ఒక్కసారిగా చల్లారిపోయింది. ఫైనల్ ఫైట్‌లో ఓటరు ఎవరివైపు నిలబడి ఉంటారన్న ఆసక్తి ఇప్పుడు రాష్ట్రాన్ని కమ్ముకుంటోంది. ఇదిలావుంటే, ఓటుకు హోదాలతో పనిలేదన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ సినిమా సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్లు సైతం ‘క్యూ’ల్లో నిలబడి ఓటు వేయడం కనిపించింది. ‘క్యూ’దాటి వెళ్లేందుకు ప్రయత్నించిన ఒకరిద్దరు సెలబ్రిటీలకు భంగపాటు తప్పలేదు. ఇదిలావుంటే హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగివున్న సెలబ్రిటీలు పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కనిపించింది. ‘ఓటు హక్కును వృధా చేయొద్దు, ఓటును కచ్చితంగా వినియోగించుకోండి’ అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చి బాధ్యత నిర్వర్తించిన సెలబ్రిటీలు, తమ ఓటు హక్కు వినియోగించుకుని స్ఫూర్తి దాయకమయ్యారు. వెటరన్ హీరో చిరంజీవి, స్టార్ హీరో మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తవ కుటుంబాలు, స్నేహితులతో వస్తే, హీరో మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నటి చార్మి ఇతర సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు తమతమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘ఈసారి ఓటు హక్కు వినియోగించుకో లేకపోతున్నందుకు క్షమించాలి’ అంటూ హీరో రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. వినయ విధేయ రామ షూటింగ్‌లో బిజీగావున్న చరణ్, ఓటు వేయలేకపోయారు. ఇక దర్శకుడు కొరటాల శివ అయితే అర్భన్ ఓటర్‌పై మండిపడ్డారు. ఇటీవలే మహేష్ బాబుతో రాజకీయ నేపథ్య కథ ‘భరత్ అనే నేను..’ చిత్రాన్ని తెరకెక్కించిన కొరటాల, అర్భన్ ఓటర్‌లోని అనాసక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రూరల్ ప్రపంచమంతా ఓటు వినియోగానికి ఉత్సాహంగా కదిలితే, అర్భన్ ఓటర్‌కు ఏమైదంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్‌లో సాయంత్రం 3 గంటలకు 35 శాతం పోలింగ్ శాతం దాటకపోవడం దారుణమన్నారు. దీనిపై పలువురు సెలబ్రిటీలూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం గమనార్హం.

చిత్రాలు.. చిరంజీవి దంపతులు *మహేష్‌బాబు దంపతులు * నాగ్ దంపతులు
*బెల్లంకొండ శ్రీనివాస్ *అల్లు అర్జున్ *చార్మి *మనోజ్