ఫన్ టీజర్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‌కౌర్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మల్టీస్టారర్ ‘ఎఫ్2’.. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ ట్యాగ్‌లైన్. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోన్న ఎఫ్2ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ హ్యాట్రిక్ విజయాల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్రమిది. మంచి మెసేజ్‌తోపాటు ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో పట్టున్న అనిల్ రావిపూడి ‘ఎఫ్2’ సినిమానూ పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా టీజర్‌ను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నారు. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చే మా బ్యానర్‌లో వస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫన్ రైడర్ ‘ఎఫ్2’. మెసేజ్‌తోపాటు అన్ని కమర్షియల్ హంగులను పర్‌ఫెక్ట్‌గా యాడ్ చేసి లాఫింగ్ రైడర్‌లాంటి చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు అనిల్‌రావిపూడి తెరకెక్కిస్తున్నాడని అన్నారు. ఒక సాంగ్ మినహా చిత్రీకరణంతా పూర్తయ్యిందని, పెండింగ్ సాంగ్ చిత్రీకరణను ప్లాన్ చేస్తున్నామన్నారు. డిసెంబర్ 12న టీజర్, త్వరలోనే పాటలను విడుదల చేస్తామన్నారు. సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్లకు వస్తుందన్నారు.