మోహన్‌లాల్.. పరకాయ ప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మోహన్‌లాల్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఫాంటసీ థ్రిల్లర్ -ఓడియన్. సెన్సార్ వద్ద ‘యు’ సర్ట్ఫికెట్ సాధించిన సినిమా డిసెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఒక్క కేరళలోనే 400 స్క్రీన్స్‌పై విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేశారు. తమిళంలోకి అనువాదమైన తొలి మలయాళ చిత్రం ఇదే అయితే, ఇటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. హరికృష్ణన్ అందించిన ఫాంటసీ థ్రిల్లర్ కథను దర్శకుడు శ్రీకుమార్ మేనన్ తెరకెక్కించాడు. ప్రకాష్‌రాజ్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు. సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించినట్టు -తెలుగులో విడుదలైన టీజర్ బట్టి అర్థమవుతుంది. ‘ఓడియన్.. వాడు చీకటి రాజ్యానికి రారాజు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘నా లక్ష్యం వాడే’నంటూ ఓ వ్యక్తిని మోహన్‌లాల్ చూపిస్తుంటే, ‘ఇంతవరకు నువ్వు నన్ను ఎన్నో రూపాల్లో చూసుంటావ్. నువ్వు చూడని రూపం మరొకటుంది’ అని మోహన్‌లాల్ చెప్పే మరో డైలాగ్‌తో టీజర్‌ను కట్‌చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. టీజర్‌లో ఉత్కంఠభరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. తెలుగులోనూ మంచి మార్కెట్‌వున్న మోహన్‌లాల్ ‘జనతా గ్యారేజ్’తో మరింత విస్తృతం చేసుకున్నాడు. ఆయన నటించిన పలు మలయాళ చిత్రాలు తెలుగులోకి అనువాదమయ్యాయి. ‘మనమంతా’, ‘కనుపాప’, ‘మన్యంపులి’కి మంచి రెస్పాన్స్ రావడంతో, ‘ఓడియన్’తో తెలుగు మార్కెట్‌పై మరింత దృష్టి పెట్టారు.
హిందూ పురాణాల్లోని ‘పరకాయ ప్రవేశ విద్య’ కానె్సప్ట్‌తో సినిమాను డిజైన్ చేసినట్టు టీజర్‌ని బట్టి తెలుస్తోంది. ఉత్తర మలబార్ అడవుల్లోని ఓడియన్ తెగ -ఆత్మరక్షణ కోసం జంతురూపాల్లోకి మారే అంశం మూలకథకు భాగమై ఉండొచ్చని అర్థమవుతుంది. గగుర్పాటు కలిగించే పోరాటాలు, సాహసాలతో సాగే చిత్రాన్ని రెండేళ్లపాటు షూట్ చేయడం తెలిసిందే. మరోపక్క సన్నివేశాలను రక్తికట్టించేందుకు గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేయడంతో, విఎఫ్‌ఎక్స్ పనులకూ ఎక్కువ సమయానే్న తీసుకున్నారు.
దర్శకుడు శ్రీకుమార్ మాటల్లో చెప్పాలంటే -బాల్యంలో ఓడియన్ కథలు ఆసక్తిగా వినేవాడిని. శత్రువులను తుదముట్టించేందుకు రాత్రి సమయాల్లో జంతు రూపాల్లోకి మారగలిగే పరకాయ ప్రవేశ విద్య ఓడియన్ తెగకు ఉండేదట. అందుకే దీన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫాంటసీ మ్యాజిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. నాకు తెలిసి ఆ తెగే మొట్టమొటి థగ్స్ (దొపిడి ముఠా) అయి ఉండాలి. ఓడియన్ తెగలో చిట్టచివరి వాడిగా మాణిక్కం పాత్ర పోషిస్తున్న మోహన్‌లాల్, కుర్ర మాణిక్కంగా కనిపించడానికి 18 కేజీల బరువు తగ్గారు. ఆయన నిజంగానే కుర్రాడిగా పరకాయ ప్రవేశం చేశారు’ అంటున్నాడు.
ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత జయచంద్రన్ సంగీతాన్ని సమకూరిస్తే, విడుదల చేసిన రెండు పాటల్లో ఒకపాటను మోహన్‌లాల్ పాడటం విశేషం. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ను కేరళ సంప్రదాయ సంగీత పరికరాలను ఉపయోగించి తమిళ సంగీత దర్శకుడు శామ్ సీఎస్ కంపోజ్ చేశారు. చిత్రంలో ఓ భీకర పోరాట దృశ్యాన్ని పీటర్ హెయిన్స్ డిజైన్ చేస్తే, మమ్మూట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం. ఎన్నో ప్రత్యేకతలతో ‘ఓడియన్’ ఆసక్తి రేకెత్తిస్తోంది.