రండి.. అంతరిక్షంలోకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ లావణ్యత్రిపాఠి, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఘాజీ ఫేమ్ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రానికి దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. కాగా చిత్ర ట్రైలర్ లాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అరవింద్ మాట్లాడుతూ నిర్మాతలు క్రిష్, రాజీవ్ మంచి ప్రయత్నం చేశారు. కొత్తదనం తెచ్చే సంకల్ప్ లాంటి డైరెక్టర్‌లు ఇంకా ఇండస్ట్రీకి రావాలి. మీడియా ఇలాంటి సినిమాలను ప్రోత్సహించి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సహాయపడాలి. వరుణ్ మా ఫ్యామిలీలో ఒక డైమండ్. అందరూ వరుస సినిమాలు చేస్తాం. కానీ వరుణ్ ఎంచుకునిమరీ సినిమాలు చేస్తాడు. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నా అన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ఇలాంటి ప్రయత్నం నిజంగా అద్భుతం. ఘాజీ తర్వాత సంకల్ప్ ఎలాంటి సినిమా చేసాడో అనుకున్నా. కానీ అంతరిక్షంపై సినిమా చేయడం గొప్ప విషయం. 1500 సీజీ షాట్స్ ఉన్న సినిమాను త్వరగా విడుదల చేయడం గ్రేట్. సంకల్ప్‌లా ఉంటే ఎంత పెద్ద సినిమా అయినా చేయొచ్చు. చిత్రం హిట్టవ్వాలని కోరుకుంటున్నానన్నారు. హీరోయిన్ అదితిరావు హైదరి మాట్లాడుతూ తెలుగులో తనకు రెండో సినిమా అని, ఇక్కడి వాతావరణం, జనం బాగా నచ్చారని చెప్పింది. సినిమాకు ఎవరు ఎంత పనిచేసినా మాతో ఇలాంటి సినిమాలు చేయిస్తున్న ఆడియెన్స్‌కి ధన్యవాదాలు. వరుణ్‌తో కంఫర్ట్‌గా వర్క్‌చేసాను. సినిమాలో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అంది. హీరోయిన్ లావణ్యత్రిపాఠి మాట్లాడుతూ సినిమాలో పార్వతి పాత్ర చేస్తున్నానని, ట్రైలర్ చూస్తుంటే అద్భుతంగా అనిపించిందని ఆనందం వ్యక్తం చేసింది. పార్వతి పాత్రకు తనను తీసుకున్న దర్శకుడు సంకల్ప్, ప్రొడ్యూసర్స్ రాజీవ్, క్రిష్‌కు కృతజ్ఞతలు తెలిపింది. డైరెక్టర్ సంకల్ప్ మాట్లాడుతూ డిసెంబర్ 21న సినిమా రాబోతుంది. అందరూ డేట్ మార్క్ చేసుకోండి. ఇలాంటి సినిమా ఎప్పుడో ఒకసారి వస్తుంది. సినిమాలో 1500 సీజీ షాట్స్ ఉన్నాయి. సినిమా చూసి అందరూ అమేజింగ్‌గా ఫీలవుతారు. ఘాజీకన్నా ఎక్కువ ప్రెజర్ ఈ సినిమాలో ఉంది. సినిమా బాగావచ్చేలా ప్రయత్నం చేశాం. ఆదరించాలన్నారు.
నిర్మాత క్రిష్ మాట్లాడుతూ ట్రైలర్ లాంచ్‌కి విచ్చేసిన సుకుమార్, అల్లు అరవింద్‌కి థాంక్స్. కథను నమ్మి సినిమా చేసిన హీరో వరుణ్‌కే క్రెడిట్ దక్కుతుంది. ఇలాంటి వెరైటీ కథలు ఒప్పుకుని వరుణ్ ఇంకా మంచి సినిమాలు చేయాలన్నారు. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఈ సినిమాకు సపోర్ట్‌చేయడానికి వచ్చిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. రిలీజ్ తర్వాత సినిమా గురించి మాట్లాడుతాను. అందరం కష్టపడి డిఫరెంట్ సినిమా చేశాం. తప్పకుండా అందరికి నచ్చుతుందన్నారు.