ఆ సినిమాలు ఆపదట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీ సీరియల్స్‌లో విప్లవాన్ని తీసుకొచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కుమార్తె ఏక్తాకఫూర్. అడల్ట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లపైనే ఆమె కాన్‌సన్‌ట్రేషన్. ఆమధ్య సొంత వీడియో స్ట్రీమింగ్ యాప్ కోసం తీసిన ‘ట్రిపుల్ ఎక్స్ అన్ సెన్సార్డ్’ అనే సిరీస్‌లో కంటెంట్ ఘాటుగా ఉండటమే కాదు విమర్శకులకూ బోలెడు పని కల్పించింది. అయినా ఏక్తా ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. రాగిణి ఎంఎంఎస్ తీసినపుడే క్రిటిక్స్ ఆమె మీద విరుచుకుపడ్డారు. అయితే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉంటూ తన పని తాను చేసుకుపోతున్న ఎక్కాకఫూర్, ఫైనల్‌గా సమాధానమిచ్చే ప్రయత్నం చేసింది. సెక్స్‌ని బేస్ చేసుకుని సినిమాలు, సీరియల్స్ తీయడంపై తనకెలాంటి సంకోచం లేదని, పైగా గర్వంగా ఫీలవుతున్నానని పేర్కొంది. మరి విమర్శల మాటేమిటి? అన్న ప్రశ్నకు -దేశంలో అందరికీ డబుల స్టాండర్డ్స్ ఉన్నాయని, ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం అమలవుతోందని పేర్కొంది. సెక్సువల్ క్రైమ్ కంటే తాను తీసేవి అసలు ప్రమాదం కాదని చెబుతోంది. అంతా బాగానే ఉందికానీ, బూతులతో సినిమాలు తీసి ఏదో అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమం చేపడుతున్నట్టు పలు చెబుతున్న ఏక్తాకఫూర్ తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. దానికి దేశానికి లింగ్ పెట్టి ఇక్కడ డబుల్‌స్టాండర్డ్స్ ఉన్నాయని నిందలు వేయడం ఏమిటని నిలదీస్తోంది. అయినా ఏక్కా అవేవీ పట్టించుకునే స్థితిలో లేదు. రాగిణి కొత్త సిరీస్ ఆల్రెడీ అయిపోవచ్చిందట.