భలే భలే హుషారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘హుషారు’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన సినిమా డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్యక్రమంలో బిగ్ సీడీ, ఆడియో సీడీలను హీరో శ్రీవిష్ణు విడుదలచేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘దర్శకుడు శ్రీహర్ష ఈ కథను ఏడాదిన్నర క్రితం చెప్పాడు. షూటింగ్ ఎప్పటినుండి స్టార్ట్‌చేస్తాం అన్నాను. బెక్కెం వేణుగోపాల్‌తో సినిమా చేస్తున్నాం. మీ అబ్బాయి ఇందులో యాక్ట్ చేస్తారా? అని అడగటానికి వచ్చాను’ అన్నాడు. నేను తను ఇంకా యుఎస్‌లోనే ఉన్నాడని చెప్పాను. ఈ సినిమాలో నటించిన యంగ్ టీమ్‌ను కలిశాను. అందరిలో పాజిటివిటీ కనపడుతుంది. తప్పకుండా సినిమా పెద్దహిట్ అవుతుంది. డిసెంబర్ 14కోసం వెయిట్ చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మాట్లాడుతూ ‘నాకు సినిమా చేసే అవకాశం ఇచ్చిన బెక్కెం వేణుగోపాల్‌కు థాంక్స్. సినిమాలో అంతా కొత్తవాళ్లు అయినా మెచ్యుర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. రాజ్‌తోట, విజయ్, సన్ని, రధన్.. అందరకీ థాంక్స్. ఈ సినిమాలో మేజిక్ జరిగింది. అది సినిమాలో చూడాల్సిందే. ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను’ అన్నారు. బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘నేను ఇప్పటివరకు తొమ్మిది సినిమాలు చేశాను. ప్రతి సినిమా ఓ ఎక్స్‌పీరియన్స్, ఇది కూడా. సినిమాపరంగా నాకునేను అప్‌డేట్ అయ్యాను. ఈ టీమ్ నన్ను సినిమాలో ఇన్‌వాల్వ్ చేశారు. కాబట్టి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎంజాయ్‌చేస్తూ సినిమా చేశాను. కొత్తవాళ్ళతో సినిమాచేసి వాళ్లు ఆనందపడుతుంటే నాకు గర్వంగా ఉంది. అందరికీ మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా’ అన్నారు. వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘బెక్కెం వేణుగోపాల్ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టం. ముఖ్యంగా కొత్తగా వచ్చిన నటీనటులకు ఆయనెంతో ఇష్టం. మంచి కథను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోడు. ఎంతో మంది కొత్తవాళ్ళను ఎంకరేజ్ చేసిన వ్యక్తి. చిన్న సినిమాను తీసి దాన్ని పెద్ద లెవల్‌లో ఎలా విడుదల చేయాలో తెలిసిన వ్యక్తి. సినిమా చూపిస్తమావ అంత పెద్ద హిట్ కావాలి. డైరెక్టర్ శ్రీహర్ష, నటీనటులకు, రధన్, రాజ్ తోట సహా ఇతర సాంకేతిక నిపుణులకు అభినందనలు అన్నారు.