వేరియేషన్స్ వెతుక్కుంటున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘హుషారు’. డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన రాహుల్ రామకృష్ణ చెప్పిన విశేషాలు. హర్ష కొనుగంటి కథ చెప్పినప్పుడు ఆయన డ్రై సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చింది. ఆయన కథ చెప్పే విధానం నచ్చి ఓకే చెప్పాను. ప్రధానంగా సినిమాలో నలుగురు యువతీ యువకులుంటారు. వారికి విరుద్ధంగా సెకండాఫ్‌లో ఎంటరయ్యే ఫ్రస్టేటెడ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌ని. సినిమాలో మంచి సందేశమైతే ఉంది. కానీ అది నాద్వారా కాదు. ఆ నలుగురు యువతీ యువకుల ద్వారానే ఉంటుంది. ఈ సినిమా ప్రధానంగా కామెడీ జోనర్‌లోనే ఉంటుంది. కాకపోతే అక్కడక్కడా కొంత కథకు అవసరమైన ఎమోషన్స్ కూడా ఉంటాయి. హుషారు అంటే ప్రతి మనిషి హుషారుగానే ఉంటారు. కానీ చనిపోయేముందు మనం మన జీవితాన్ని తిరిగి చూసుకుంటే మనకు జ్ఞాపకాలు తప్ప ఇంకేమి ఉండవు. అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించాం. నాకు చాలామంది సాఫ్ట్‌వేర్ జాబ్‌చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. వారి జీవితంలో కొన్ని సంఘటనలు కూడా ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికీ ఒక ట్రిబ్యూట్‌లా ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ సాఫ్ట్‌వేర్ అయినా నాకు సాఫ్ట్‌వేర్ పట్ల అంత అవగాహన ఉండదు. అందుకే రకరకాల వంటలు వండి ప్రదర్శిస్తాను. ఇక అర్జున్‌రెడ్డి తరువాత నేను చాలా సినిమాలు చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ పిచాక్ సాంగ్ రెస్పాన్స్ చూసి నిజంగా హ్యాపీగా ఫీలయ్యాను. ఈమధ్యకాలంలో ‘్భరత్ అను నేను’ సినిమాలో కొరటాల శివ నాతో మంచి ఎమోషనల్ క్యారెక్టర్ చేయించారు. అప్పటినుండి నాకోసం అన్ని అలాంటి క్యారెక్టర్లే రాస్తున్నారు రైటర్స్. నాకు వేరియేషన్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. నెక్స్ట్ ‘మిఠాయి’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సందీప్‌కిషన్‌తో ‘నిను వీడని నీడను నేను’ చేస్తున్నాను. ప్రశాంత్ వర్మ, రాజశేఖర్, ‘కల్కి’ చేస్తున్నాను. వివేక్ ఆత్రేయ, సత్యదేవ్‌తో సినిమా ఉంది. రీసెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నా. దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను.