ఓకే.. దుల్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ జోరుపెంచాడు. నాలుగేళ్ల క్రితం బాలాజీ మోహన్ చిత్రం ‘వాయు మూడి పేసవం’ హిట్టుతో అరంగేట్రం చేసిన దుల్కర్, -తరువాత సెలెక్టెడ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఓకే కన్మణి, సోలో, మహానటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలందుకున్న దుల్కర్, తాజాగా కొత్త తమిళ ప్రాజెక్టు వాన్‌తో బిజీ అయ్యాడు. ట్రావెల్ బేస్డ్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రాన్ని రా కార్తీక్ తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో దుల్కర్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు. కళ్యాణి ప్రయదర్శన్, క్రితి కర్బందాలను ఇప్పటికే ఎంపిక చేసుకున్న యూనిట్, మరో హీరోయిన్‌ను త్వరలోనే ప్రకటించనుంది. నిర్మాత కెఎస్ రవికుమార్ ఈ ప్రాజెక్టులో ఓ కీలక అతిథి పాత్రలో కనిపిస్తాడట. ‘అన్ని వయసుల వాళ్లను ఆకట్టుకునే వైవిధ్యమైన కథ. రొటీన్ రొమాంటిక్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని గట్టిగా చెప్పగలను అన్నది దర్శకుడు కార్తిక్ మాట. తమిళనాడు పరిసరాలు, ఉత్తర భారత ప్రాంతాల్లో చిత్రం షూట్ చేస్తున్నారు. ఇదిలావుంటే వరుస తమిళ చిత్రాలకూ దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇవి చేస్తూనే హిందీలో మూడో ప్రాజెక్టు చేయడానికీ సిద్ధమవుతున్నాడట. ఆమధ్య శ్రీదేవి కుమార్తె జాన్వీతో సినిమా చేస్తానని కరణ్ జోహార్ ప్రకటించడం తెలిసిందే. జాన్వీతో చేయబోయే ప్రాజెక్టులోకి దుల్కర్‌ను తీసుకోవాలని కరణ్ భావిస్తున్నాడని వినికిడి. తొలి మహిళా ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సెనా స్టోరీని జాన్వీతో స్క్రీన్‌కు ఎక్కించే యోచనలోవున్న కరణ్, ఆమెకు జోడీగా దుల్కర్‌ను తీసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో కర్వాన్ ప్రాజెక్టు చేసిన దుల్కర్, సోనమ్ కఫూర్ జోడీగా జోయా ఫ్యాక్టర్ చిత్రం చేశాడు. ఇప్పుడు కరణ్ ప్రాజెక్టు ఓకే అయితే, దుల్కర్‌కు మూడో ప్రాజెక్టు అవుతుంది. కార్గిల్ యుద్ధ సమయంలో సైనిక క్షతగాత్రులను తన విమానంలో సురక్షిత ప్రాంతాలకు తరలించిన సాహసవంతురాలిగా గుంజన్ సక్సేనా నిలిచింది. ఆమె విజయగాథనే ఇప్పుడు తెరకెక్కించాలని, అందుకు జాన్వీకి జోడీగా దుల్కర్ సూటవుతాడని కరణ్ టీం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తమిళంలో ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాదితాల్’ షూటింగ్ పూర్తి చేశాడు దుల్కర్. రీతూవర్మ హీరోయిన్. తాజాగా మొదలైన ‘వాన్’ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసుకుని, వచ్చే సెప్టెంబర్‌నుంచి మొదలయ్యే కరణ్ ప్రాజెక్టుకు లైన్‌క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నాడట. ఈమధ్యనే ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ ‘నా కెరీర్‌కు లాంగ్వేజ్ ఎప్పుడూ ఇబ్బంది కాలేదు. చెన్నైలోనూ ఎదగాలనుకుంటున్నా. అందుకే తమిళాన్ని నేర్చుకుని ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నా. సబ్జెక్టు నచ్చితే ఏ భాషా చిత్రాల్లోనైనా చేయాలన్నది నా ఆలోచన. అయితే బయటి ఇండస్ట్రీల్లో చేస్తున్న కొన్ని తరహాల ప్రాజెక్టులు సొంత లాంగ్వేజ్‌లో చేయలేకపోతున్నా. ఇక బాలీవుడ్‌లోనూ ప్రూవ్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నా’ అన్నాడు. అంటే -్భషతో సంబంధం లేకుండా యూనివర్శల్ హీరోగా ఎదిగేందుకు దుల్కర్ తన ప్రణాళికలకు పదును పెడుతున్నాడన్న మాట. మలయాళంలో ప్రస్తుతం దుల్కర్ చేస్తున్న ఓరు యమందన్ ప్రేమకథ పట్ల అక్కడ అంచనాలు పెరుగుతున్నాయి.