మూడు భాషల్లో మణికర్ణిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం -మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 18న విడుదల చేస్తారట. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుందట. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన చిత్రం వీఎఫ్‌ఎక్స్ పనుల వల్ల ఆలస్యమైంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రానికి సంగీతత్రయం శంకర్ -ఎహసాన్- లాయ్‌లు స్వరాలు సమకూరుస్తున్నారు. భారీ బడ్జెట్‌తో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదలకానుంది.