దిశా తిరిగింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెల్విన్ క్లెయిన్ (సీకే) లోదుస్తుల కంపెనీకి ఎనలేని పాపులార్టీ తెచ్చిన టాప్ మోడల్ దిశా పటానీ. ఆమె బ్యూటీగురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రాండ్‌వల్ల ఆమెకు ఇమేజ్ పెరిగిందా? ఆమెవల్లే బ్రాండ్‌కి ఇమేజ్ పెరిగిందా? అన్న ప్రశ్న ఎదురైతే -ఆ బ్రాండ్‌కి దిశావల్లే ఎక్కువ ఇమేజ్ పెరిగిందన్న సమాధానమే వస్తుంది. ఒంపుసొంపులు ఖిల్లా.. అథ్లెటిక్ రూపం.. పెర్ఫెక్ట్ ఫిట్‌నెస్.. వీటి సమ్మేళమనే దిశా సమ్మోహనం అన్న విషయం ఆమె బ్రాండ్ పిక్స్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మొన్నటికి మొన్న దీపావళి శుభాకాంక్షలను సైతం ‘బ్యూటీ బ్రాండ్’గా చెప్పి దిశా వార్తల్లోకి ఎక్కడం తెలిసిందే. ఇప్పటికే సీకే బ్రాండ్‌కి ఉవ్వెత్తున ప్రచారం తెచ్చిపెట్టడంలో దిశా పటానీ విజయవంతమైంది. ఈ సిరీస్‌లో రకరకాల భంగిమలతో ఫోజులిచ్చి అంతకంతకూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్ చేస్తూ వేడి పెంచుతూనే ఉంది. దిశా ఇలా ఇన్‌వోర్‌లో దర్శనమివ్వగానే వాటిని యూత్ అంతేవేగంగా ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ వెడెక్కిస్తున్నారు. ఇంతకంటే బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్‌ని చూడలేం అన్నట్టే ఉంది వ్యవహారం. ప్రస్తుతం ఈ భామ సల్మాన్ నటిస్తున్న ‘్భరత్’ చిత్రంలో నటిస్తోంది. ఈద్ కానుకగా వచ్చే జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తారట. ఎక్స్‌గాళ్‌ఫ్రెండ్ కత్రినా ఈ చిత్రంలో సల్మాన్‌తో జోడీకడితే, చెల్లి పాత్రలో దిశా కనిపించనుందట. టైగర్ జిందా హై ఫేమ్ అబ్బాస్ అలీ జాఫర్ సినిమాకి దర్శకుడు. బాఘి 2 ఘన విజయం తరువాత టైగల్ ష్రాఫ్‌తో మరో ప్రాజెక్టు చేసే ప్రణాళికల్లో దిశా బిజీగా ఉందట.