బార్బీ.. బబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరుపుతీగ కత్రినా మరోసారి కుర్రోళ్ల గుండెల్లో గుబులురేపింది. మెరుపందం, ఉరుముల్లాంటి స్టెప్పులతో యూత్ గుండెల్లో జడివాన కురిపిస్తోంది. కత్రినా ప్రధాన పాత్ర చేసిన ‘జీరో’ డిసెంబర్ 21న విడుదల కానుండటం తెలిసిందే. మద్యానికి బానిసైన సినీ స్టార్‌గా వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్న కత్రినా, అందుకు తగ్గట్టు ‘హస్న్ పర్చామ్’ అంటూ సాగే పాటలో చెలరేగిపోయింది. మొన్నవచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌లో మేని మెరుపులు సృష్టించిన కత్రినా, ‘జీరో’లో మరింత ఉత్సాహవంతమైన డ్యాన్స్‌తో మెప్పించేలానే కనిపిస్తోంది. హస్న్ పర్చామ్ సాంగ్‌ను తాజాగా చిత్రబృందం యూటూబ్‌లో విడుదల చేస్తే, దాన్ని షారూక్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ‘బబితా కుమారి వచ్చింది. ఈ ఏడాది ఈ పాటే హైలెట్‌గా నిలవనుంది’ అంటూ హ్యాష్‌టాగ్ చేశాడు. అంతేకాదు, కత్రినా స్టిల్స్‌ను సోషల్ మీడియాకూ విడుదల చేస్తూ ‘ఈ పిల్ల ఎంత బావుంది కదూ. సినిమా విడుదల తరువాత ఆమెను మన మనస్సుల్లో ప్రతిష్ఠిద్దాం. అందాన్ని వర్ణించడానే్న హస్న్ పర్చామ్ అంటారు అంటూ పోస్ట్ చేశాడు. సొంత బ్యానర్‌పై షారూక్ భార్య గౌరీఖాన్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రానికి దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. ఇందులో మరుగుజ్జు పాత్ర పోషించి షారూక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేశాడు.