రుషివో.. రాజర్షివో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న యన్‌టిఆర్ చిత్రం రెండో భాగంలోని పాట దూసుకుపోతోంది. ముందు ప్రకటించినట్టే ‘రాజర్షి’ పాటను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ‘తల్లి ఏదీ? తండ్రి ఏడీ? అడ్డతగిలే బంధమేదీ? అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘యన్‌టిఆర్’ బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కథానాయడు’ ‘మహానాయకుడు’ టైటిల్స్‌తో రెండు భాగాలుగా రానుండటం తెలిసిందే.
ఇప్పటికే విడుదల చేసిన ‘కథానాయకా’ అంటూ కైలాష్ కేర్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన మిగిలిన పాటలనూ ఈనెల్లోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రంగం సిద్ధం చేస్తోంది. సంక్రాంతికి మొదటి భాగం, పక్షంరోజుల్లో రెండోభాగాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే యూనిట్ ప్రకటించటం తెలిసిందే. చిత్రంలో ప్రధాన పాత్రను బాలకృష్ణ పోషిస్తుంటే, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు పాత్రలో రానా, శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్‌రామ్, అక్కినేని పాత్రలో సుమంత్, సావిత్రి పాత్రలో నిత్యమీనన్, జయసుధ పాత్రలో హన్సిక కనిపించనుండటం తెలిసిందే. ఇదిలావుంటే, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ చాలాకాలం తరువాత ముఖానికి రంగు వేసుకోడానికి సిద్ధమయ్యాడు. యన్‌టిఆర్ బయోపిక్‌లో లెజెండరీ దర్శకుడు రాఘవేంద్రరావు పాత్రలో కనిపిస్తాడట. ఎన్టీఆర్‌కి, రాఘవేంద్రరావు మధ్య చక్కటి అనుబంధముంది. వీరిద్దరి కలయికలో ‘వేటగాడు, డ్రైవర్ రాముడు, అడవి రాముడు’ లాంటి పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల షూటింగ్‌కి సంబంధించిన సంఘటనలను బయోపిక్‌లో చూపించనున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్‌బికె ఫిల్మ్స్, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంస్థలపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తుండటం తెలిసిందే.