అనగనగా.. అరడజను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముగుస్తున్న డిసెంబర్ మాసంలో సినిమా హోరు వినిపిస్తోంది. జోరు కనిపిస్తుంది. కొన్ని పెద్ద సినిమాలు ఇప్పటికే విడుదలై చిన్న చిత్రాలకు రూట్ క్లియర్ చేయడం, ఒక మోస్తరు చిత్రాలు అనుకున్నవి డిసెంబర్ చివరి వారంలో విడుదలకానున్న నేపథ్యంలో -మధ్యలో గ్యాప్‌ను చిన్న చిత్రాలు దాదాపుగా ఆక్రమించాయి. ఆడియన్స్‌ను అలరించేందుకు నేడు కనీసం అరడజను చిత్రాలు థియేటర్లకు వస్తున్నాయంటే -ఎంత జోరు కనిపిస్తుందో అంచనా వేసుకోవచ్చు. డిసెంబర్ చివరి వారం దాటితే సంక్రాతికి పెద్ద చిత్రాల జోరు పెరిగే అవకాశం ఉండటంతో -చిన్న చిత్రాలతో థియేటర్లు కళకళలాడే పరిస్థితి కనిపిస్తోంది. వీటిలో స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతోపాటు అనువాద చిత్రాలూ థియేటర్లను ఆక్రమిస్తున్నాయి. ఇప్పటి వరకూ నిర్మాతలు ప్రకటించిన వివరాలను బట్టి ఈ ఒక్క రోజులోనే అరడజను చిత్రాలు.. అనగనగా ప్రేమ కథ, హుషారు, భైరవగీత, ఓడియన్, సముద్రపుత్రుడు, పెళ్లి రోజు చిత్రాలు థియేటర్లకు వస్తున్నాయి. మూవీ లెజెండ్ మోహన్‌లాల్ మలయాళంలో నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం -ఓడియన్ తెలుగులో అనువాద చిత్రంగా వస్తోంది. ఒక గిరిజన తెగ అనుసరించిన పరికాయ ప్రవేశ విద్య బ్యాక్‌డ్రాప్‌లో -ఆ తెగలోని చిట్టచివరి వ్యక్తిగా మోహన్‌లాల్ వైవిధ్యమైన పాత్ర పోషిస్తుండటంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ కుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా, వీఎఫ్‌ఎక్స్ పనుల కోసం ఎక్కువ సమయాన్నీ తీసుకున్నారు. మెస్మరైజ్ చేసే గ్రాఫిక్స్‌తో వస్తున్న సినిమా ఏమేరకు అలరిస్తుందో చూడాలి. ఇక హాలీవుడ్ చిత్రం ఆక్వామేన్ తెలుగులో సముద్రపుత్రుడుగా విడదలవుతోంది. ఇప్పటికే చైనాలో విడుదలై సెనే్సషన్ సృష్టించిన ఈ చిత్రం, యూఎస్‌కంటే ముందే తెలుగులో విడుదలవుతోంది. జేమ్స్‌వాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సైతం అత్యాధునిక సాంకేతిక, గ్రాఫిక్స్ సృజనాత్మకకతో వస్తుండటంతో ఈ చిత్రంపైనా అంచనాలు లేకపోలేదు. ఆక్వామేన్ టైటిల్ పాత్రను జేమ్స్ మెమోవా పోషించాడు. ఇక థౌజండ్ లైట్స్ మీడియా బ్యానర్‌పై కెఎల్‌ఎన్ రాజు నిర్మించిన ‘అనగనగా ఒకరోజు’ చిత్రం థియేటర్లకు వచ్చింది. కొత్త ఆర్టిస్టులు విరాజ్ జె అశ్విన్, రిద్దికుమార్, రాధా బంగారు ప్రధాన పాత్రలుగా రూపుదిద్దుకున్న చిత్రాన్ని ప్రతాప్ తాతంశెట్టి తెరకెక్కించాడు. క్లీన్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించగలదన్న గట్టినమ్మకంతో చిత్ర యూనిట్ కనిపిస్తోంది. ఇక ధనంజయ, ఇర్రామోర్ జంటగా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త దర్శకుడు సిద్ధార్థ తాతోలు తెరకెక్కించిన చిత్రం భైరవగీత. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రానికి రవిశంకర్ సంగీతం సమకూర్చాడు. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రంపై ఆడియన్స్‌లో ఒకింత ఆసక్తి లేకపోలేదు. పెద్ద చిత్రాల కారణంగా భైరవగీత సైతం వాయిదా పడుతూ వస్తున్నా, ఈసారి థియేటర్లకు రావడం ఖాయంగానే కనిపిస్తోంది. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘హుషారు’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన సినిమా కూడా ఈరోజు విడుదలవుతుంది. సినిమాలో అంతా కొత్తవాళ్లు అయినా మెచ్యుర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో మేజిక్ జరిగింది. అది సినిమాలో చూడాల్సిందేనంటూ ప్రచారం చేసుకుంది హుషారు చిత్రం. వచ్చే వారం సైతం ఆడియన్స్‌కు విందే. చిన్న, మధ్యస్త బడ్జెట్ చిత్రాలు మరో అరడజను వరకూ థియేటర్లలో సందడి చేసే అవకాశం కనిపిస్తోంది.