కింగే.. లక్కీఫెలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షారూఖ్ మరుగుజ్జు పాత్రతో మెప్పించనున్న చిత్రం -జీరో. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కథానాయిక పాత్రలు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ‘జీరో’పై భారీ అంచనాలె నెలకొన్నాయి. డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ఇప్పటికే పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా తన పాత్ర గురించి మీడియాతో మాట్లాడిన కత్రినా కైఫ్ -లిప్ లాక్ సన్నివేశాలపైనా హాట్ కామెంట్స్ చేసి వేడి పుట్టించింది. 35ఏళ్ల వయసులోనూ స్టార్ హీరోల సరసన హాట్ బ్యూటీగా సెగలు పుట్టిస్తున్న కత్రినా -మొత్తానికి జీరో చిత్రంతో షారూఖ్ భీషణ నిర్ణయానికి సడలింపు తెచ్చింది. ‘ముద్దు’ సన్నివేశాల్లో నటించేది లేదంటూ రెండు దశాబ్దాలుగా నియమాన్ని పాటిస్తున్న షారూఖ్ -ఎట్టకేలకు ‘జీరో’లో కత్రినాతో కిస్ సీన్‌కు కమిట్ కాక తప్పలేదు. హాట్ సినీ నటి పాత్ర పోషిస్తున్న కత్రినా -షారూక్‌తో రెండు సన్నివేశాల్లో లిప్ లాక్ సీన్ చేసిందన్నది తాజా సమాచారం. ఇదే ప్రశ్న మీడియా నుంచి ఆమెకు ఎదురైనపుడు -ఆసక్తికరమైన సమాధానంతో కత్రినా మార్కులు కొట్టేసింది. షారూక్‌తో ముద్దు సన్నివేశం చేయడం అదృష్టంగా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘నేను అదృష్టంగా భావించడమేంటి? నాతో ముద్దు సన్నివేశంలో నటించే వాళ్లకు అదృష్టం ఉండాలి’ అంటూ నవ్వుతూనే చమత్కరించింది. షారూకే అదృష్టవంతుడంటూ కత్రినా సరదాగా వ్యాఖ్యానించిందట.