వస్తారట కేటీఆర్.. ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ప్రస్తుతం ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌ని రేపటినుండి అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన పబ్ సెట్‌లో షూట్ చేయనున్నారు. సాంగ్‌లో చరణ్ సరసన బాలీవుడ్ నటి స్టెప్‌లు వేయనుంది. ఈనెల 27న సినిమా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారట. అయితే చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిథులుగా రాజవౌళి, ఎన్టీఆర్‌తోపాటు ప్రత్యేక అతిథిగా కేటీఆర్ కూడా వస్తారని తెలుస్తోంది. దానయ్యనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటంతో ఎన్టీఆర్, రాజవౌళి కూడా ఈవెంట్‌లో పాల్గొననున్నారు. అలాగే కేటీఆర్‌కి, చరణ్‌కి మంచి సాన్నిహిత్యమున్న కారణంగా కేటీఆర్ కూడా వేడుకలో పాల్గొననున్నారు. జనవరి 11న విడుదలకానున్న చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే చాలావరకు పూర్తిఅయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన ‘్భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.