ముగించేస్తున్న మహర్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరత్ అను నేను చిత్రం తరువాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రం మహర్షి షూటింగ్ గత 20 రోజులుగా హైదరాబాద్‌లో వేసిన భారీ విలేజ్ సెట్‌లో జరుగుతుంది. ఈ లాంగ్ షెడ్యూల్ మరో 14 రోజుల్లో పూర్తి కానుందని సమాచారం. ప్రస్తుతం ఈ షెడ్యూల్‌లో సినిమాలోని సెకెండ్ హాఫ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్దె కథానాయికగా నటిస్తుండగా, అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఆయన పాత్ర సినిమాకు కీలకం కానుంది. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరణ దాదాపు పూరె్తైనట్టే. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 5న విడుదల కానుంది.