ప్రయోగాలంటే మహా పిచ్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో కొత్త తరహా సినిమాలు, సరికొత్త ప్రయోగాలకు తెరలేపిన దర్శకుడు సంకల్ప్. ఘాజిలాంటి సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాడు. తాజాగా మరో కొత్త ప్రయోగంగా ఆడియన్స్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, ఆదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న చిత్రాన్ని ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సినిమా విడదలకు దగ్గరపడిన నేపథ్యంలో మీడియాకు సినిమా విశేషాలను వెల్లడించాడు దర్శకుడు సంకల్ప్. ‘ఇలాంటి చిత్రాలు తెరకెక్కించే అవకాశాలు మనకు బహుతక్కువ. ఈ చిత్రంలో 1500 సీజీ షాట్స్ పెట్టాం. సినిమా చూసి అంతా అమేజింగ్ అనకుండా ఉండలేరనే నమ్ముతున్నా. ఈ సినిమా కోసం ఘాజీకంటే ఎక్కువ వత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఘాజి హిట్టయిన ఆనందంలో ఉన్నపుడే ఈ సినిమా ఆలోచన పుట్టింది. ఓ పత్రికలో స్పేస్‌కు సంబంధించిన ఓ ఆర్టికల్ చదివినపుడు -అలాంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదన్న ఆలోచన నుంచి ఈ కథ రాసుకున్నా. హీరో వరుణ్ తేజ్ అయితే బాగుంటుదని సంప్రదించి, కథతో ఆయన ఇంప్రెస్ అయిన తరువాతే ప్రాసెస్ మొదలుపెట్టాం. నిజానికి ఇలాంటి చిత్రాలు ఒప్పుకోడానికి చాలామంది హీరోలు వెనుకడుకు వేయొచ్చు. కానీ, వరుణ్ ఉత్సాహంగా ఈ సినిమా పూర్తి చేయడం హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకుడికి తప్పకుండా ఇదో కొత్త అనుభూతి. స్పేస్ నేపథ్యంగా తెరకెక్కిన కథే అయినా, కమర్షియల్ ఫార్మాట్‌కు అనుగుణంగా అన్నిరకాల ఎమోషన్స్‌నీ క్యారీ చేశాం. వరుణ్, ఆదితిరావ్‌లు ఆస్ట్రోనాట్స్‌గా కనిపిస్తే, వరుణ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి కనిపిస్తారు. నిర్మాతల సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. స్క్రిప్ట్ కారణంగా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువే అయినా, అర్థం చేసుకుని క్రిష్ సపోర్ట్ చేశారు. నా కష్టానికి పూర్తిగా సహకరించిన యూనిట్‌కు థాంక్స్ చెప్పకుండా ఉండలేను. ఈ సినిమా తరువాత బాలీవుడ్‌కు వెళ్తారా? అన్న ప్రశ్న తరచూ ఎదురవుతోంది. ఇప్పటికే అక్కడ రెండు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ఈ సినిమా తరువాత బాలీవుడ్‌ల సినిమా ప్లాన్ చేస్తున్నా. ఒకవేళ అది ఆలస్యమైతే -ఇదే బ్యానర్‌లో అంతరిక్షం-2 చేయాలన్న ఆలోచన ఉంది. నాకు ప్రయోగాత్మక సినిమాలంటే పిచ్చి. సినిమా విషయంలో బాగా రీసెర్చ్ చేస్తాను. ఇప్పటి వరకూ వచ్చిన స్పేస్ సినిమాలకు ఇది చాలా దూరం. ఎక్కడా ఏ సినిమాకూ పోలిక ఉండదు’ అంటూ వివరించాడు సంకల్ప్.