గౌతమ్.. విక్రమ్.. మోహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బన్నీని ఒప్పించడంలో విఫలమైన విక్రమ్‌కుమార్ -స్క్రీన్‌మీదకు నానిని లాక్కురావడంలో విజయం సాధించాడు. తీరిగ్గా పిట్టగోడపై కూర్చుని విక్రమ్ చెప్పిన కథ హీరో నానికి బలంగా అతుక్కుపోవడంతో -ప్రాజెక్టును సెట్స్‌పైకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి ప్రాజెక్టు ఖాయంగా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందన్నది టాక్. ప్రస్తుతం ‘జెర్సీ’తో బిజీగావున్న నాని -గ్యాప్‌లేకుండా షూటింగ్‌ను పరిగెత్తిస్తూనే, విక్రమ్ సినిమా పనులు చక్కబెట్టుకుంటున్నాడట. అందుకే వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రానికి సంబంధించి విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైంది. అందులో ఒకటి -నాని, విక్రమ్ ప్రాజెక్టులో అచ్చంగా ఐదుగురు హీరోయిన్లు ఉంటారని. కథకు సంబంధించినంత వరకూ కథానాయిక ఒక్కరే అయినా -కథను మలుపు తిప్పే, కథకు ట్విస్ట్‌నిచ్చే కీలక పాత్రల్లో మరో నలుగురు హీరోయిన్లు కనిపిస్తారన్నది వినిపిస్తోన్న మాట. సో, నాని సినిమా కోసం ఐదుగురు అందమైన భామలను వెతికే పనిలో నిమగ్నమైందట యూనిట్. నానికి సరిపడే హీరోయిన్లలో అవకాశం ఎవరి తలుపు తడుతుందో చూడాలి. అప్పుడప్పుడూ స్టార్, మీడియం హీరోల సినిమాల్లో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లతో సందడి చేయడం తెలుగు పరిశ్రమకు అలవాటైన ప్రక్రియే. కాకపోతే నాని సినిమాలో ఎకాఎకిన ఐదుగురు అందగత్తెలు స్క్రీన్‌మీద కనిపిస్తారంటే -కథలో విశేషమేదో ఉండే ఉంటుందన్న ఆసక్తి మొదలైంది. ఇదిలావుంటే విక్రమ్ తదుపరి ప్రాజెక్టునూ నాని లైన్లో పెడుతున్నట్టు టాక్. తనతో అష్టా-చెమ్మా, జెంటిల్‌మేన్ చిత్రాలు తీసి హ్యాట్రిక్ హిట్టు కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ మూవీ చేయబోత్నున్నట్టు గత కొద్దిరోజులుగా కథనాలు వస్తున్నాయి. ఆ ప్రాజెక్టులో నాని క్రైంబ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్ చేయొచ్చని తెలుస్తోంది. అయితే కథకు అనుగుణంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేయగల విలన్ పాత్ర కోసం వెతుకులాటలో ఉన్నట్టు సమాచారం. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో ఆ పాత్ర చేయించే ప్రయత్నాల్లో ఇంద్రగంటి ఉన్నట్టు చెబుతున్నారు. దీనిపై దుల్కర్ నుంచి ఇంతవరకూ ఎలాంటి ప్రతిస్పందన రాలేదని తెలుస్తోంది.