క్రైమ్/లీగల్

తృటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 14: విద్యార్థులతో వస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా పొగలు రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురై కేకలు పెట్టారు. ఇది గమనించిన స్థానికులు బస్సు అద్దాలను పగులగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. శుక్రవారం ఉదయం ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాయికల్, తండా, రామేశ్వరం, విఠ్యాల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొని షాద్‌నగర్ పట్టణంలోని నారాయణ ప్రైవేట్ స్కూల్‌కు వస్తున్న బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురై ఏమవుతుందో అయోమయ పరిస్థితుల మధ్య ఏడ్వడం మొదలుపెట్టారు. స్కూల్ బస్సు వెనుకభాగం నుంచి పొగలు వస్తున్న విషయాన్ని ఇతర వాహనదారులు బస్సు డ్రైవర్‌కు చెప్పడంతో అక్కడికక్కడే నిలిపివేశారు. అప్పటికే బస్సులో సుమారు 30మందికి పైగానే విద్యార్థులు ఉన్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు, వాహనదారులు గమనించిఘటన స్థలానికి చేరుకొని బస్సు అద్దాలను పగులగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. భయాందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకొని క్షేమంగా ఉన్న విద్యార్థులను చూసి ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ బస్సు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన బస్సులను తీసుకువచ్చి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసమని పాఠశాల యజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.
కమ్ముకున్న పొగ మంచు
షాబాద్, డిసెంబర్ 14: శుక్రవారం ఉదయం పొగమంచు కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 10 గంటల వరకు రోడ్డుపై వాహనాలు నడిపేవారు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని నడిపించారు. ద్విచక్ర వాహనదారులు చల్లికి గజగజ వణుకుతూ ఇబ్బందులు పడ్డారు. పాఠశాలలకు, ఉద్యోగాలకు వెళ్లేవారు సూర్యుడు కనిపించక పోవడంతో వెలుతురు లేక ఇబ్బందులు పడ్డారు. రోడ్లు పొగమంచుతో కప్పుకోవడంతో బస్సులు, ద్విచక్ర వాహనదారులు నెమ్మదిగా నడిపించారు.

సెల్‌చార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్‌తో యువతి మృతి
బొంరాస్‌పేట, డిసెంబర్ 14: బొంరాస్‌పేట మండలం వడిచెర్ల పంచాయతి పరిధిలోని ఉరేనికి తండాకు చెందిన అర్చన(18) అనే యువతి సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతున్న సమయంలో విద్యుత్ షాక్ గురై మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. ఫోన్ చార్జింగ్ లేకపోవడంతో చార్జింగ్ పెడుతున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురికావడంతో చికిత్స నిమిత్తం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, తాండా వాసులు తెలిపారు.