వస్తున్నాడు.. వైఎస్సార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జననేతగా తెలుగోడి గుండెల్లో పదిలమైన చోటుదక్కించుకున్న నేత, ఉమ్మడి ఆంధ్ర సీఎంగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్రలోని ఒక పార్శ్వాన్ని ‘యాత్ర’ పేరిట నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ టీజర్ మంచి స్పందన సాధించింది. మొదటి సింగిల్ సాంగ్‌తోనే యాత్ర స్టోరీలోని హై ఇంటెన్సిటీని చూపించారు. ఆనందోబ్రహ్మ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మహి వీరరాఘవ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. భలే మంచిరోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో మంచి పేరు సాధించిన 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్యయంతో, ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 8న యాత్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే తెలుగుతోపాటు తమిళం, మలయాళంలోనూ యాత్ర చిత్రాన్ని ఫిబ్రవరి 8నే విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ మడమ తిప్పని నేత వైఎస్ పాత్రలో మలయాళీ స్టార్ మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేశారన్నారు. యాత్ర మొదటి లుక్‌కి, టీజర్‌కి, ఫస్ట్ సింగిల్‌కు రెండు రాష్ట్రాల్లో అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న ‘యాత్ర’ తమ బ్యానర్‌లో హాట్రిక్ సక్సెస్ ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తోన్న చిత్రంలో ఆద్యంతం ఎమోషన్‌తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తుందన్నారు. దివంగత నేత వైఎస్ రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయిందని, ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శమైందన్నారు. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్రలో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో యాత్ర నిర్మించామన్నారు. ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమా వైఎస్సార్ అభిమానులతోపాటు సాధారణ సినిమా ప్రేక్షకులనీ అమితంగా ఆకట్టుకుంటుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. మూడు భాషల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రాన్ని ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.