నెగిటివ్ వద్దు బాసూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనాటి కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీకృష్ణతులాభారం, పచ్చని సంసారం, గుండమ్మకథ, అడవి రాముడు, మూగమనసులు, చిక్కడు-దొరకడు, కలిసుంటే కలదు సుఖం, మంచి మనసులు, కొడుకు దిద్దిన కాపురం వంటి ఎన్నో అచ్చ తెలుగులో ఉండే పేర్లను సినిమాలకు పెట్టేవారు. ఎన్టీఆర్, ఎస్‌వి రంగారావు, అక్కినేనిలాంటి మహానటుల కాలంలో సినిమా కథ, కథనాలకు సరిపోయే విధంగా ఉండేవి టైటిల్స్. ఆనాటి దర్శకులు మొత్తం కథ, కథనాలకు సరిపోయే విధంగా సినిమాలకు పేర్లు పెట్టేవారు. కొంతకాలం గడిచాక, మరో ట్రెండ్‌లో అసెంబ్లీరౌడీ, రౌడీ అల్లుడు, దొంగ దొంగ, రంగూన్ రౌడీ, స్టేట్‌రౌడీ లాంటి చాలా నెగెటివ్ పేర్లు పుట్టుకొచ్చాయి. మన తెలుగు చిత్ర పరిశ్రమలో నెగెటివ్ పేర్లు ఇప్పుడు కొత్తగా వచ్చినవేం కాదు, గతంలోనూ ఇలాంటి నెగెటివ్ పేర్లతో చాలా సినిమాలే వచ్చాయి. కాని అవి తక్కువ సంఖ్యలో ఉండేవి.
నేడు మన దర్శక, నిర్మాతల, హీరోల ఆలోచనా ధోరణి మారింది. నేడు ఒక స్టార్ దర్శకుడు, మరొక స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడంటే టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉండాలని మాత్రమే ఆలోచిస్తున్నాడు తప్ప కథకు టైటిల్ సూటవుతుందా లేదా అని ఆలోచించట్లేదు. పైగా అవి నెగెటివ్, ఇతర భాషా టైటిల్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. నేటి ఆధునిక యుగంలో మన తెలుగు చిత్రాలకు తెలుగు పేర్లు పెడితేనే అదొక గొప్ప ఘనకార్యంగా భావించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక నెగెటివ్ టైటిల్ పెట్టడంలో దర్శక, నిర్మాతలు, హీరోలు పోటీపడుతున్నారు. ఇడియట్, పోకిరి, టెంపర్, లోఫర్, కంత్రి, బిల్లా, షాడో ఇవన్నీ ఇలా పుట్టుకొస్తున్నవే. బాద్షా, బలుపు.. ఇలా చెప్పుకుంటూపోతే లెక్కలేనన్ని. సినిమాకి సూటయ్యే టైటిల్స్ వదిలేసి, దర్శక, నిర్మాతలు, హీరోలు పిచ్చిపేర్లు, నెగెటివ్ టైటిల్స్ వెనుక పడటం బాధాకరం. ఇవి చాలవన్నట్లు డబ్బింగ్ చిత్రాలు సైతం ఎక్కువగా నెగెటివ్ టైటిల్స్‌తోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆవారా, విలన్, ఉత్తమ విలన్, యముడు వంటి వాటిని ఉదహరించొచ్చు? వినడానికే ఇబ్బందిగా ఉన్న టైటిల్స్‌ను బలవంతంగా రుద్దుతూ క్రమంగా అలవాటు చేస్తున్న పరిస్థితి దారుణం. అసలు మన ప్రేక్షకుల్లో సగం మంది సినిమాలకు దూరంగా ఉండటానికి మొదటి కారణం ఆయా చిత్రాల టైటిల్సే. సినిమా పేరే సరిగ్గాలేదు, ఇక సినిమాలో విషయం ఏముంటుందని సగంమంది తెలుగు భాషాభిమానులు చిత్రాలను చూడటంలేదనే అనుకోవాలి. ఈ విషయంలో స్టార్ హీరోలు సైతం జోక్యంచేసుకొని మంచి తెలుగుపేర్లు పెడితే ఇండస్ట్రీ కళకళలాడుతుందేమో.
అలా అని మన తెలుగు చిత్రాలకు తెలుగు పేర్లు పెట్టడం లేదా అంటే పెడుతున్నారు, కాని వాళ్లు చాలాకొంతమంది మాత్రమే. అందులోముందు వరసలో సురేందర్‌రెడ్డి, శ్రీకాంత్ అడ్డాల, రాజవౌళిలాంటి వాళ్లను వేళ్లపై లెక్కపెట్టుకొనే పరిస్థితి. ప్రస్తుత ట్రెండ్‌లో కూడా కొన్ని మంచి టైటిల్స్ -సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సాహసం, అతనొక్కడే, విక్రమార్కుడు వంటి పవర్‌ఫుల్ తెలుగు పేర్లు పెట్టారు. ఈ దిశగా మన దర్శక, నిర్మాత, హీరోలు టైటిల్స్ విషయంలో చొరవతో వ్యవహరిస్తే తెలుగు భాషాభిమానులు సంతోషిస్తారు. గత ఏడాది మంచి టైటిల్స్‌తో వచ్చి హిట్టందుకున్న కొన్నింటిని గమనిస్తే -్భరత్ అను నేను, రంగస్థలం, అరవింద సమేత వీరరాఘవ, గీతగోవిందం, నాపేరుసూర్య, మహానటి, భాగమతి, తొలిప్రేమలను చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మొదలైన చిత్రాల్లోనూ ఇప్పటికే రామ్‌చరణ్ -వినయవిధేయ రామ అంటూ వస్తే, బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చాడు. మిగిలిన హీరోల చిత్రాలు సైతం మంచి పేర్లే ప్రకటిస్తున్నారు. ఈ సంస్కృతి కొనసాగాలని ఆశిద్దాం..

-బి కృష్ణ, హైదరాబాద్