ప్రభాస్ జానూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తర్వాత ప్రభాస్ ‘సాహూ’ చిత్రాన్ని మొదలుపెట్టాడు. సాహూ భారీ బడ్జెట్ చిత్రంతోపాటు భారీ యాక్షన్ మూవీ కావడంతో ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ సమయంలోనే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం పీరియాడిక్ మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రేమకథతో రూపొందుతున్న చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంపై గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి ‘జానూ’ టైటిలే ఖరారైందంటూ క్లారిటీ వచ్చింది. ఈ టైటిల్‌పై ప్రభాస్ బాగా ఆసక్తి చూపించినట్లుగా తెలుస్తోంది. జానూ రెండు అక్షరాల టైటిల్ కావడంతోపాటు, హిందీలో డార్లింగ్ అనే అర్థం వస్తుంది. ఈ సినిమా కోసం ప్రభాస్‌తో పూజా హెగ్డే జోడీ కట్టడం తెలిసిందే. విభిన్నమైన ప్రేమకథగా రూపొందుతున్న చిత్రాన్ని 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్.