సైరా ఓబయ్య ఇలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరెకెక్కుతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా సైరా బృందం సినిమాలో విజయ్ సేతుపతి లుక్‌ని రివీల్ చేస్తూ పోస్టర్‌ను అండ్ మోషన్ టీజర్‌ను విడుదల చేసింది. 2018లో అతడు అరడజను సినిమాల్లో నటించాడు. 2019లో మరో అరడజను సినిమాలు క్యూలో వున్నాయి. సైరాలో ఓబయ్య అనే విప్లవకారుడి పాత్రలో అతడు నటిస్తున్నాడు. తాజాగా అతడి పాత్ర లుక్‌ను సైరా టీమ్ విడుదల చేసింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నయనతార, తమన్నా, సుధీప్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.