వేసవికి.. ఏబీసీడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీరేట్‌కు అమ్ముడైన విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాత డి.సురేష్‌బాబు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తుండడం విశేషం. ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మోగా బ్రదర్ నాగబాబు ఇందులో అల్లు శిరీష్‌కు తండ్రి పాత్రలో నటించారు. బాల నటుడిగా మనకు సుపరిచితమైన భరత్ ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. సంజీవ్‌రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయవౌతున్నారు. బిగ్‌బెన్ సినిమాస్ యశ్ రంగినేనితో కలిసి మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లో మధుర శ్రీ్ధర్ ఈ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధాసాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని మార్చి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో అల్లుశిరీష్‌తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. సురేష్‌బాబుగారు ఈ సినిమాకు సమర్పకులుగా సురేష్ ప్రౌడక్షన్స్ బ్యానర్ ద్వారా మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం. మెగాబ్రదర్ నాగబాబుగారు ఇందులో శిరీష్‌కు తండ్రి పాత్రలో నటించారు. మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథకావడంతో రీమేక్ చేస్తున్నాం. కృష్ణార్జునయుద్ధం ఫేం రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధాసాంధీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. దర్శకుడు సంజీవ్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తీర్చిదిద్దారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే ఈ చిత్రాన్ని మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అని అన్నారు.