ఊరంతా అనుకుంటున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోవాస్కైర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. నవీన్ విజయ్‌కృష్ణ, శ్రీనివాస్ అవసరాల హీరోలు. మేఘాచౌదరి, సోఫియాసింగ్ నాయికలు. బాలాజి సానల దర్శకుడు. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పిఎల్‌ఎన్ రెడ్డి, ఎ పద్మనాభరెడ్డి నిర్మాతలు. టైటిల్ లోగోను సూపర్‌స్టార్ కృష్ణ, ఫస్ట్‌లుక్‌ను విజయనిర్మల, హీరో ఫస్ట్‌లుక్‌ను నరేష్, నవీన్ లుక్ టీజర్‌ను కృష్ణ, విజయనిర్మల విడుదలచేశారు. హీరో నవీన్ విజయ్‌కృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసింది. కృష్ణ, విజయనిర్మల మాట్లాడుతూ.. ‘టైటిల్ బావుంటే సగం సినిమా సక్సెస్ అయినట్టే. అందులోనూ ఈ సినిమాకు ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే నేటివ్ టైటిల్ దొరికింది. నవీన్‌లో ఈజ్ ఉంది. ఆర్టిస్ట్‌గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. నవీన్‌కి ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలి’ అన్నారు. కెఎం రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ‘నవీన్ పాత్ర చాలా బావుంటుంది. కథాబలం ఉన్న సినిమా. గ్రామీణ నేపథ్యంతో సాగుతుంది’ అన్నారు. నవీన్ మాట్లాడుతూ ‘పాలకొల్లులో సినిమా కోసం షూటింగ్ చేశామని, అక్కడి వాతావరణం చూస్తే అక్కడే సెటిల్ కావాలనిపించింది. చాలా మంచి సినిమా అవుతుంది’ అన్నారు. నరేష్ మాట్లాడుతూ ‘నందిని నర్సింగ్‌హోమ్‌తో నవీన్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. ఆర్టిస్ట్‌గా నిలదొక్కుకోవాలనేది అతని తాపత్రయం. 5, 6 స్క్రిప్ట్‌లు విన్నాక, ఈ కథ మాకు బాగా నచ్చింది. నేను బావున్నాయన్న సినిమాలు 99 శాతం ఫెయిల్ కాలేదు. ఇది మంచి ఎంటర్‌టైనర్ అవుతుంది. టైటిల్ బావుంది. మిగిలిన తారాగణం బావుంది. నేను ప్రివ్యూ చూశాను. నిర్మాతలకు టేస్ట్ ఉందనిపించింది. డబ్బింగ్ జరుగుతోంది’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో అందంగా సాగే సినిమా ఇది. క్యూట్ విలేజ్ బోయ్‌గా నవీన్ మెప్పిస్తాడు. కొత్త జోనర్ సినిమా అవుతుంది. నవీన్‌లోని పలు షేడ్స్ ఈ సినిమాలో ఆవిష్కృతమవుతాయి’ అన్నారు.