మళ్లీ.. ఎక్కుపెట్టాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిగ్గజ దర్శకుడు శంకర్ మరో సెనే్సషన్ సృష్టించేందుకు శుక్రవారం ముహూర్తం నిర్ణయించుకున్నాడు. విలక్షణ నటుడు కమల్‌హాసన్ -శంకర్ కాంబినేషన్ వస్తున్న భారతీయుడు -2 సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నైలో నిర్వహించారు. చిత్రంలో కమల్‌తో జోడీ కడుతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ పూజా కార్యక్రమం ఫొటోను అభిమానులతో పంచుకుంది. పూజా కార్యక్రమంలో కమల్ ఖాకీ దుస్తులు ధరించి ఉండటం విశేషం. చిత్రీకరణ మొదలుపెట్టిన నేపథ్యంలో సినిమాకు సంబంధించి వివిధ రకాల గెటప్పులతో ప్రమోషన్ పోస్టర్లను చిత్రబృందం అభిమానులతో పంచుకుంటోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుంటే, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాష్‌కరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. 22ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ మొదలవ్వడంతో -ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. అటు శంకర్, ఇటు కమల్ అభిమానుల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. భారతీయుడిని గుర్తు చేస్తూ విడుదల చేసిన సీక్వెల్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన రావడం తెలిసిందే. అలాగే, ఈ ప్రాజెక్టులో ముఖ్యభాగమైన వర్మ కళ అనే విద్యను ప్రాక్టీస్ చేస్తున్నట్టు కాజల్ చెప్పుకుంటోంది కూడా.
అదీ అసలు కారణం..
ఇదిలావుంటే -అసలు భారతీయుడు చిత్రం తెరకెక్కించడానికి ముఖ్య కారణాన్ని దర్శకుడు శంకర్ రివీల్ చేశాడు. శంకర్ -కమల్ కాంబోలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన భారతీయుడు కథను రాసుకోవడానికి ముఖ్య కారణం -లంచమేనట. శంకర్ చదువుకుంటున్న రోజుల్లో కళాశాల ఆడ్మిషన్ కోసం వెళ్తే అక్కడి యాజమాన్యం దృవీకరణ పత్రాలు అడిగిందట. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం అధికారుల వద్దకు వెళ్తే లంచం డిమాండ్ చేశారట. అప్పుడు పడిన బీజం నుంచే భారతీయుడు కథ పుట్టుకొచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శంకర్ వెల్లడించాడు. అంతేకాదు -సమాజంలో ప్రతి సామాన్యుడూ ఎదుర్కొంటున్న సమస్యనే భారతీయుడు -2లోనూ చూపించనున్నట్టు ప్రకటించేశాడు. ఏ ప్రాజెక్టునైనా సుదీర్ఘంగా నడిపించే శంకర్ -ఈ ప్రాజెక్టును మాత్రం సాధ్యమైనంత వరకూ ఈ ఏడాదిలోనే పూర్తిచేసి విడుదల చేయాలన్న తలంపుతో ఉన్నాడట.