బోయపాటితో బాలయ్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ సినిమా కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న చిత్రానికి మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని టాక్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సంచలన విజయం అందుకోవడంతో హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బోయపాటి శ్రీను తాజాగా రామ్‌చరణ్‌తో తెరకెక్కించిన వినయ విధేయ రామ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు టూమచ్‌గా ఉన్నాయంటూ మెగాఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కేవలం యాక్షన్ కోసమే సినిమా చేసినట్టు ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ సినిమా విషయంలో అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టిన బోయపాటి ఈ సినిమాలో బాలయ్యతో డ్యూయెల్ రోల్ చేయస్తాడంటూ ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.