ట్రైలర్‌లో ‘కెఎస్ 100’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రశేఖర్ మూవీస్ పతాకంపై సమీర్‌ఖాన్, శైలజ, సునీల్‌పాండే, ఆశిరాయ్, శ్రద్ధ, అక్షత ప్రధాన పాత్రధారులుగా కె.వెంకట్‌రామ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘కె ఎస్ 100’. షేర్ దర్శకత్వం వహించిన చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌రామ్‌రెడ్డి మాట్లాడుతూ మంచి హర్రర్ థ్రిల్లర్ రొమాంటిక్ మూవీ చాలా బాగొచ్చిందని, అందరికీ నచ్చుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ సునీతపాండే మాట్లాడుతూ భోజ్‌పూరి, పంజాబి భాషల్లో నటించిన తనకు తెలుగులో ఇదే మొదటి సినిమా అన్నారు. సౌత్‌లో వర్క్ చేయాలన్న ఆశ ఇలా నెరవేరిందన్నారు. హీరో సమీర్‌ఖాన్ మాట్లాడుతూ యాక్టర్ అవ్వాలనే కల ఈ చిత్రంతో నెరవేరుతోందని, మంచి సబ్జెక్టుతో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. టీమ్ అంతా హార్డ్‌వర్క్‌చేసామన్నారు. దర్శకుడు షేర్ మాట్లాడుతూ సినిమాలో ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని, చాలా అనుభవంతో చేశారన్నారు. ఈతరం అమ్మాయిలు ఏ విధంగా ఫాస్ట్‌కల్చర్‌ను అలవర్చుకుంటున్నారన్న కానె్సప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. కెఎస్ (కుమారస్వామి) హీరో పాత్ర పేరని, 100 అన్నది వాళ్ల స్నేహకాలన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన చిత్రం నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు.