‘గేమర్’.. చాలా స్పీడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజి వెంచర్స్ పతాకంపై నూతన నటీనటులతో రాజేష్ తడకల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమర్’. శ్రీనిత్‌రాజ్, కల్యాణి పటేల్, అనిరుధ్, నేహా ప్రధాన పాత్రలు. సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తడకల రాజేష్ నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ ప్రేక్షకులకు నచ్చే చిత్రాన్ని తెరకెక్కించాడన్నారు. చిన్న సినిమాల దర్శక నిర్మాతలను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, థియేటర్ల నుంచే సమస్య ఎదురవుతుందన్నారు. కొత్త టాలెంట్ రావాలంటే చిన్న దర్శక నిర్మాతలను ఎంకరేజ్ చేయాలన్నారు. హీరో హీరోయిన్స్ శ్రీనిత్‌రాజ్, కల్యాణికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. హీరో శ్రనీత్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులవల్లే ఈ స్థాయికి చేరానని, ప్రధాన పాత్రనిచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో క్లారిటీతో దర్శకుడు సినిమా తీశాడని, టీమ్ మొత్తం హార్డ్‌వర్క్ చేశామన్నారు. తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు హీరోయిన్ కల్యాణి థాంక్స్ చెప్పింది. దర్శక నిర్మాత రాజేష్ మాట్లాడుతూ ఇది తనకు ఏడో చిత్రమని, ఈ సినిమాతో పరిచయమవుతోన్న శ్రనీత్‌రాజ్ పెర్ఫార్మెన్స్ బావుందన్నారు. అనిరుధ్, నరేందర్, అల్త్ఫా, సింధు నిహ ఇతర పాత్రలు పోషించారని, ప్రతీ సీన్ డిఫరెంట్‌గా ఆసక్తి రేపుతుందన్నారు. సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 1న విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.