నవ్వుల పండుగే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్-2’ సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో మెహరీన్ మాట్లాడుతూ సినిమాను హిట్ చేసి మేమే ది బెస్ట్ అని ప్రేక్షకులు ప్రూవ్ చేశారన్నారు. అనీల్‌తో రెండు సినిమాలు చేసే అవకాశం దక్కిందని, ఎస్‌విసిని హోం బ్యానర్‌లా ఫీల్ అవుతానంది. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ఎఫ్-2 టైటిల్‌తో అనిల్ వీ 2(వెంకటేష్, వరుణ్‌తేజ్- విక్టరీ) సాధించాడన్నారు. మా బ్యానర్‌లో 31వ సినిమాగా ఎంటర్‌టైన్ చేసిన అనీల్‌కు థాంక్స్ చెప్పారు. కొంచెం నవ్విస్తే చాలు, బ్రహ్మరథం పడతారని ప్రేక్షకులు నిరూపించారన్నారు.
వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘సినిమాను పెద్ద సక్సెస్ చేసినందుకు థాంక్స్ చిన్నమాటే అవుతుంది. ఓ సినిమా చేయాలంటే 100/200 కష్టం ఉంటుంది. అందరం పాజిటివ్ మైండ్ సెట్‌తో సినిమాను స్టార్ట్‌చేశాం. కామెడీ కోసం చిరంజీవి, వెంకటేష్ సినిమాలు చూసేవాడిని. చిరు సినిమాలతో ఇన్‌స్పైర్ అయితే.. వెంకటేష్‌తో వర్క్ ఇన్‌స్పైర్ పొందానన్నారు. త్వరలోనే ఎఫ్ 3 చేయబోతున్నాం. ఎఫ్ 2నే ఇలా ఉంటే ఎఫ్ 3 ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’ అన్నారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ‘సినిమాను హిట్, సూపర్‌హిట్ అనుకుంటే.. ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేసేశారు. మనస్ఫూర్తిగా ప్రేక్షకుల కళ్ళలో ఆనందం చూసినప్పుడు.. పదేళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్లి అక్కడ ఆడియెన్స్ రెస్పాన్స్ చూసినప్పుడు.. నాకు మాత్రం కళ్ళలో కన్నీళ్లు వచ్చేశాయి. మేం అందరం కష్టపడి పనిచేసినప్పుడు.. ప్రేక్షకులు బాగా ఆదరించినప్పుడు ఆ ఆనందమే వేరు. నాకు గణేష్, ప్రేమించుకుందాం రా, బొబ్బిలిరాజా, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి ఇలా చాలా సినిమాలను నాకు సక్సెస్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ఆనందంగా ఉంది.
దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్‌లకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థాంక్స్. వరుణ్ చాలామంచి నటనను కనపరిచాడు. తమన్నా, మెహరీన్‌లకు థాంక్స్. సినిమాటోగ్రాఫర్ సమీర్‌రెడ్డికి, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ సహా ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్. ఫ్యామిలీతో మళ్లీమళ్లీ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.