రీమేక్‌లంటే ఇష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథాబలం ఉన్నా పాత్రల్లో నటిస్తూ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది విద్యాబాలన్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీపైనా దృష్టి సారించింది. బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకంగా కనిపించిన విద్య, తల అజిత్ నటించనున్న పింక్ రీమేక్‌లోనూ నటించనుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రీమేక్ సినిమాల్లో నటించడం ఇష్టం ఉండదని, కానీ బోనీకపూర్ పింక్ రీమేక్‌లో అతిధి పాత్రలో నటిస్తావా? అని అడిగేసరికి అతనితోవున్న ప్రత్యేక అనుబంధం కారణంగా కాదనలేకపోయానని చెప్పింది. ఖాకీఫేమ్ వినోత్ తెరకెక్కించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంతోపాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లోనూ విద్యాబాలన్ నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.