..మహాలక్ష్మి ముగించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న దట్‌ఈజ్ మహాలక్ష్మి షూటింగ్ పూర్తిచేసుకుంది. సాధారణ యువతినుంచి అసాధారణ మహిళగా ఎలా మారుతుందనే కథతో దటీజ్ మహాలక్ష్మి సినిమా తెరకెక్కుతుంది. ఈమధ్యే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమిత్‌త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. త్వరలోనే చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. మైఖెల్ ట్యాబ్యురియస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. టైజాన్ ఖొరాకివాలా దటీజ్ మహాలక్ష్మి సినిమాను సమర్పిస్తున్నారు. మెడైంటే ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మను కుమరన్ ప్రొడక్షన్‌లో ఈ చిత్రం వస్తుంది. తమన్నాను ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్స్ రాజీవ్ మసంద్, అనుపమ్‌చోప్రా ఇంటర్వ్యూ చేసి సినిమా ప్రమోషన్‌ను ఘనంగా మొదలుపెట్టారు. నటి పరుల్‌యాదవ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు.