‘రన్‌వే’కు ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమన్ చాణిక్య సెల్యులాయిడ్ బేనర్‌పై నిర్మించిన లఘు చిత్రం ‘రన్‌వే’ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించారు. గంటన్నర నిడివిగల చిత్రానికి కిరణ్ పాలపర్తి దర్శకత్వం వహించారు. రచయిత, ఎడిటింగ్ కూడా ఆయనే. సినీ ప్రముఖలు తమ్మారెడ్డి భరద్వాజ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ప్రివ్యూ చూసి దర్శకుడు కిరణపై ప్రశంసలు కురపించారు. పిండికొద్దీ రొట్టె అన్నట్టు దర్శకుడు పిండి తక్కువైన రొట్టెను రుచిగా తయారు చేశాడని తమ్మారెడ్డి కితాబిచ్చారు. సినిమా రంగానికి కొత్త అయినా ఏడు విభాగాల్లో కిరణ్ ప్రతిభను చూపడాడని కృష్ణారెడ్డి అన్నారు. దర్శకుడికి మంచి భవిష్యత్ ఉందని ఆయన చెప్పారు. మంచి ఇతివృత్తంతో రన్‌వేను రూపొందించారని అచ్చిరెడ్డి పేర్కొన్నారు. క్లుప్తంగా కథ...ఓ యువకుడు మేనమామ కుమార్తెను ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుందామంటే ఆమె తల్లిదండ్రులు జులాయిగా తిరుగుతున్నాడని నిరాకరిస్తారు. డబ్బులు సంపాదించడానికి అతడు గల్ఫ్ వెళ్లి నానా అగచాట్లు పడతాడు. ఈలోగా అమ్మాయికి పెళ్లి కుదురుతుంది. కొన్ని కారణాల వల్ల పెళ్లి చెడుతుంది. ఎలాగోలా సొంతూరు చేరుకున్న యువకుడిని ఎదురైన అనుభవం చక్కగా చిత్రీకరించారు. ప్రేమ, పెళ్లి, కుటుంబం సెంటిమెంట్, ఆర్థిక ఇబ్బందులు గంటర్నరలో కళ్లకుకట్టినట్టు చూపారు. ‘రన్‌వే’లో రాజా వర, హర్షిత, సనత్, భద్రాజీ, లక్ష్మీకల్యాణ్, కిరణ్, పవన్ ప్రధాన పాత్రలు పోషించారు. డీవోపీ: ఎన్‌బీ విశ్వనాథ్. టీమ్: కార్తీక్, సాగర్. డ్రోన్: అశీష్. ఎడిటింగ్-వీఎఫ్‌సీ: కిరణ్ పాలపర్తి.