ఆ చిత్రమ్‌కు అదే స్పెషల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌పిఏ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథా చిత్రమ్-2. హరికిషన్ దర్శకుడు. సుమంత్ అశ్విన్, సిద్ధిఇద్నాని జంటగా నటిస్తుంటే, ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ నందితశే్వత ముఖ్యపాత్రలో నటిస్తుంటే, మరో ఆకర్షణ రావ్ రమేష్ వాయస్ ఓవర్ కానుంది. నిర్మాత సుదర్శన్‌రెడ్డి తెరకెక్కించిన ‘ప్రేమకథాచిత్రమ్-2’ చిత్రం ఇప్పటికే శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌ద్వారా కోటి 43 లక్షలు దక్కించుకుంది. ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రేమకథాచిత్రమ్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా వస్తున్న ప్రేమకథాచిత్రమ్-2ని అంతే క్రేజ్‌తో రూపొందిస్తున్నాం. మనందరికీ ఎంతో ఇష్టమైన నటుడు రావురమేష్ ఈ చిత్రంకోసం వాయిస్‌ఓవర్ చెప్పడం విశేషం. ఆయన వాయిస్ ఓవర్‌తో ప్రేక్షకులు కథలోకి లీనమవుతారు. ఆయనకు ఈ సందర్భంగా మా యూనిట్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఇక ఈ చిత్రంలో నందితశే్వత మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా, సిద్ధి ఇద్నాని మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. విధ్యుల్లేఖ, ప్రభాస్‌శ్రీను మధ్య వచ్చే కామెడీ హిలేరియస్‌గా ఉంటుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం. పూర్తి సర్‌ప్రైజింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న మా ప్రేమకథాచిత్రమ్-2 అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అని అన్నారు.