డార్క్ మిఠాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాఫ్ట్‌వేర్ కుర్రాడు సాయి భ్రమల్లో బతుకుతుంటాడు. పగటి కలలు పోటుగాడిని ఉద్యోగం నుంచి తొలగిస్తుంది కంపెనీ. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఓ సమస్య ఎదురవుతుంది. మూడురోజుల్లో ఓ దొంగను పట్టుకుంటేనే పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు. అటువంటి సందర్భంలో స్నేహితుడు జానీతో కలిసి దొంగను పట్టుకోవడానికి సాయి బయలుదేరతాడు. ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సమస్యలేంటి? సాయి దొంగను పట్టుకున్నాడా? లేదా? అసలు, దొంగ ఎవరు? సాయి పెళ్లి జరిగిందా? లేదా? ఫిబ్రవరి 22న విడుదలవుతున్న సినిమా చూసి తెలుసుకోవచ్చంటున్నాడు దర్శకుడు ప్రశాంత్‌కుమార్. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా ప్రశాంత్‌కుమార్ దర్శకత్వం వహించిన డార్క్ కామెడీ చిత్రం ‘మిఠాయి’. డాక్టర్ ప్రభాత్‌కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం టీజర్ విడుదల చేశారు. నిర్మాత ప్రభాత్‌కుమార్ మాట్లాడుతూ ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో నడిచే చిత్రమిది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. సాయిగా రాహుల్ రామకృష్ణ బాగా నటించాడు. ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం అన్నారు. కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవివర్మ, అజయ్ ఘోష్, అర్ష, శే్వతావర్మ, అదితి మ్యాకల్, విజయ్ మరార్, గాయత్రి గుప్తా ప్రధాన తారాగణం. ఛాయాగ్రహణం రవివర్మన్ నీలమేఘం, సంగీతం వివేక్‌సాగర్ సమకూరుస్తున్నారు.