మొదలైన సింహనాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ లలిత మూవీ మేకర్స్, శ్రీ వైష్ణవ స్పిరిటైన్‌మెంట్స్ సంయుక్తంగా పి.శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘సింహనాదం’ (శ్రీ నరసింహస్వామి వారి వైభవం). సుమన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ భారతీయ విద్యాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు స్వామీజీల ఆశీస్సులతో ఈ చిత్రం టైటిల్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింహయాజి స్వామి, కామిశెట్టి శ్రీనివాస్, రామానుజాచార్యులు, విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి, బిజెపి నాయకురాలు గీతామూర్తి, ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నరసింహస్వామి వైభవాన్ని చాటి చెబుతూ రూపొందుతున్న సింహనాదం ఘనవిజయం సాధించాలని వీరంతా అభిలషించారు. ఈ సందర్భంగా శ్రీ అహోబిల నరసింహస్వామిపై తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన కీర్తనలతో కూడిన సర్వం సింహమయం ఆడియో సీడీని ఆవిష్కరించారు. సుమన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుపుతున్నామని, త్వరలో సెట్స్‌కు వెళ్లనున్నామని దర్శకుడు పి.శ్రీనివాస్ తెలిపారు.