కల్యాణ్‌తో విరించి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతోపాటు ‘మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాడు దర్శకుడు విరించివర్మ. అయితే రెండవ సినిమా ‘మజ్ను’ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని తదుపరి చిత్రాన్ని చేసేందుకు సిద్ధంఅయ్యాడు. ఈయన మూడవ సినిమాను నందమూరి కళ్యాణ్‌రామ్‌తో చేయబోతున్నాడట. ఇటీవలే విరించివర్మ చెప్పిన కథకు కళ్యాణ్‌రామ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని-త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లుకూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసిన తర్వాత కళ్యాణ్‌రామ్ ఈ సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉంది. త్వరలోనే కళ్యాణ్‌రామ్ ‘118’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాలో చాలా స్పెషల్‌గా కనిపింస్తాడట.