విజయ్‌తో వెంకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతేడాది టాక్సీవాలా, గీతగోవిందం సక్సెస్‌లను ఖాతాలో వేసుకుని జోరుమీదున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోందని టాక్. దీంతోపాటు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న విజయ్, మరో క్రేజీ ప్రాజెక్ట్‌కూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. గత ఏడాది వరుణ్‌తేజ్ తొలిప్రేమతో ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా తెరకెక్కించిన మిస్టర్ మజ్ను శుక్రవారం విడుదలవుతోంది. ఆ సినిమా తరువాత వెంకీ అట్లూరి మూడో సినిమా విజయ్ దేవరకొండతోనే అని టాక్. విజయ్ దేవరకొండ మైత్రికి రెండు ప్రాజెక్టులకు సైన్ చేసాడట. ఒకటి ఇప్పుడు నిర్మాణంలోవున్న డియర్ కామ్రేడ్. రెండో దానికోసం వెంకీ అట్లూరి కాంబినేషన్‌ని విజయ్ కోసం సెట్ చేస్తున్నారట మైత్రి నిర్మాతలు.