పోలీస్ అధికారిగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన పేట చిత్రం ఇటీవల విడుదలై 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక ఈ చిత్రం తరువాత రజినీ, మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రంలో తలైవా పవర్‌ఫుల్ పోలీస్ ఆపీసర్ పాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే రజినీ ఇప్పట్లో సినిమాలకు గుడ్‌బై చెప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటె తనను పేటలో స్లైలిష్‌గా చూపించి మంచి మార్కులుకొట్టేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు రజినీ మరో ఛాన్స్ ఇవ్వనున్నాడని టాక్. అలాగే తన గత చిత్రాల్లో కొన్ని సినిమాలకు సీక్వెల్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది తలైవా. సో మరో 5 సంవత్సరాలపాటు ఆయన సినిమాల్లో కొనసాగే అవకాశం ఉందన్నమాట. ఇక మరోవైపు రజినీ పొలిటికల్ పార్టీని కూడా స్థాపించిన విషయం తెలిసిందే. మరి ఈ రెండింటిని ఎలా బ్యాలన్స్ చేస్తారో చూడాలి.