మజ్ను.. మా ఓన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని చిన్నోడు అఖిల్, నిధి అగర్వాల్ జంటగా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం -మిస్టర్ మజ్ను. జనవరి 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో అఖిల్ మీడియాకు చెప్పిన ముచ్చట్లు.
కథ నచ్చింది: ఓ పాత్ర నేపథ్యంలో సాగే కథ కావడంతో బాగా నచ్చేసింది. క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్ ఎగ్జైటింగ్, ఛాలెంజింగ్ అనిపించింది. ఇంతకుముందు చేసిన రెండు చిత్రాలకి ఇది భిన్నం. ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ రెండూ అందుతాయి.
దర్శకుడి గురించి..: వెంకీ గుడ్ డైరెక్టర్. గుడ్ రైటర్ కూడా. నాన్నకు అతను పెద్ద ఫ్యాన్. నినే్న పెళ్లాడుతా, మమ్నధుడు లాంటి సినిమాల ప్రేరణతోనే ఇదీ చేశాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసిన వెంకీ చాలాకాలంగా తెలిసినా, మజ్ను నుంచి దగ్గరైపోయాడు.
స్పీడ్‌గా జరిగింది..: ‘హలో’ స్క్రిప్ట్‌కి ఎక్కువ వర్క్ చేశాం. ఆ సినిమాకీ షూటింగ్‌కీ ఎక్కువ డేస్‌పట్టాయి. అఖిల్‌కీ అంతే. కానీ మిస్టర్ మజ్ను ఫుల్ స్క్రిప్ట్‌తో వెంకీ సిద్ధంగా ఉండటంతో, వేగంగా పూరె్తైంది.
గత సినిమాల నుండి..: బాడీ లాంగ్వేజ్, డిక్షన్, యాక్షన్ అంతా కొత్తగా చూపించే ఉద్దేశ్యంతో వెంకీ, నేనూ చాలా వర్క్ చేశాం. ఎప్పటికప్పుడు పనిలో ఆత్మవిమర్శ చేసుకుంటానంటూ మజ్ను ఆడియో ఈవెంట్‌లో తారక్ అన్న ప్రస్తావించింది అందుకే.
టైటిల్ విషయంలో..: మిస్టర్ అని పెట్టడానికి ప్రత్యేకమైన కారణాలేమీ లేవు. కాకపోతే ఓన్లీ మజ్ను పెడితే ట్రాజెడీ ఫీలింగ్ ఉంటుందన్న ఆలోచనతో మిస్టర్‌ను తగిలించాడు వెంకీ. దీనివల్ల మోడ్రన్ మజ్నును చూపించబోతున్నాడనే సెన్స్ కూడా హైలెట్ అవుతోంది.
మజ్ను ఫ్యామిలీ..: మజ్ను టైటిల్ బాగా కలిసొచ్చింది మా ఫ్యామిలీకి. లైలామజ్నుగా తాతగారు, మజ్నుగా నాన్న.. ఇప్పుడు మిస్టర్ మజ్నుగా నేను.
లవ్‌తోపాటు..: ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాలో అన్నిరకాల ఎమోషన్స్ ఉంటాయి. యాక్షన్ పార్టూ ఉంది. మూడు ఫైట్లు ఉన్నాయి. అలాగే సినిమాలో నాకూ, నా బాబాయ్‌కి, నా పిన్నికి మధ్య వచ్చే ట్రాక్ కూడా బాగుంటుంది.
ఎన్టీఆర్ నుంచి ఏదో..: ఏదోకాదు, మాస్ నేర్చుకోమన్నారు. అదే ఎలా నేర్చుకోవాలో తెలియట్లేదు. ఇక ఎలా నేర్చుకోవాలో నాన్నను అడగాలి.
మ్యూజిక్ సూపర్..: ఒక లవ్‌స్టోరీకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. కచ్చితంగా తమన్ మ్యూజిక్ ‘మజ్ను’ను మరో లెవల్‌కి తీసుకెళ్తుంది. ఈమధ్య తమన్ చేస్తున్న సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే.
మల్టీ స్టారర్స్..: గతంలోనే ఓ మల్టీస్టారర్ చెయ్యమని అడిగారు. కానీ అప్పుడు చెయ్యటం కరెక్ట్‌కాదని చెయ్యలేదు. కథ నచ్చితే మాత్రం ఫ్యూచర్‌లో చేస్తాను. అలాగే స్పోర్ట్ నేపథ్యంలో సినిమా కూడా అడుగుతున్నారు. తప్పకుండా మంచి కథ కుదిరితే చేస్తా.
తదుపరి చిత్రాలు..: ప్రస్తుతం నా దృష్టి అంతా పూర్తిగా ‘మిస్టర్ మజ్ను’పైనే ఉంది. ఈ సినిమా విడుదలైన తరువాతే నా తదుపరి చిత్రం గురించి ప్రకటిస్తా. ఈసారి నెక్స్ట్ సినిమా దసరాకు ముందే వచ్చేలా ప్లాన్ చేస్తా.

-శ్రీనివాస్ ఆర్ రావ్