హాలీవుడ్‌లోకి కరీనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ గ్లామర్ గర్ల్ బెబో.. అదేనండి కరీనాకపూర్ పెళ్లిచేసుకుని బాలీవుడ్‌లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమెకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అర్జున్‌కపూర్‌తో కలిసి నటిస్తున్న ‘కి అండ్ కా’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలు చేస్తున్న ఈ భామకు ఇప్పుడు హాలీవుడ్ ఛాన్స్ దక్కింది. ఎప్పటినుండో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలన్న కరీనా కోరిక ఇన్నాళ్ళకు తీరింది. ఓ ప్రముఖ హాలీవుడ్ సినిమాలో కరీనా హీరోయిన్‌గా నటిస్తుందట! అయితే ఈ హాలీవుడ్ ఎంట్రీ విషయంలో కరీనా మాత్రం అంత ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. దానికి కారణం ఈమధ్య హిందీ సినిమాలు అన్ని విదేశీ భాషలలో సైతం డబ్ అవుతున్నాయి. ఈ సినిమాలను జనాలు కూడా ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి హాలీవుడ్ సినిమా చేయడం అవసరమా? అనే ఆలోచనలో ఉందట!! ఇప్పటికే హాలీవుడ్‌లో ప్రియాంకచోప్రా, దీపిక పదుకొనేలు సత్తా చాటుతున్నారు.