ప్రియ క్రేజ్ ఒకరకం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటి రెప్పతో క్రేజ్‌ను తెచ్చుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. రోషన్‌కు జోడీగా నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. తెలుగులో ‘లవర్స్ డే’గా సుఖీభవ సినిమాస్ విడుదల చేస్తోంది. లవర్స్ డే కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో నిర్మాతలు ఏ గురురాజ్, సిహెచ్ వినోద్‌రెడ్డిలు ప్రమోషన్స్‌ని పెంచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నన్ను నిర్మాతగా ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు. తాజాగా మలయాళం సినిమా ‘ఒరు ఆధార్ లవ్’ను తెలుగులో విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన ప్రియ క్రేజ్ దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. నిజంగా చిన్న చిత్రాల్లో ఈ సినిమా డబ్బింగ్ హక్కుల్లో రికార్డ్ ధర పలికింది. దర్శకుడు ఒమర్ లులు అద్భుతంగా తెరకెక్కించాడు. తెలుగులో సంచలన విజయం సాధిస్తుందన్న నమ్మకముంది’ అన్నారు. మరో నిర్మాత వినోద్‌రెడ్డి మాట్లాడుతూ సినిమాకు మంచి క్రేజ్ వచ్చిందని, ఆడియో, టీజర్‌తో మరింత పాపులరైందన్నారు. తెలుగుతోపాటు ఓవర్‌సీస్‌లోనూ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు.