స్పెషల్.. ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదా శర్మ పలు చిత్రాలు చేసినా కమర్షియల్ బ్రేక్ సంపాదించలేకపోయింది. దాంతో ఇప్పుడు ఐటెం సాంగ్స్ కోసం రెడీ అయ్యిందట. వరుస హిట్లతో మంచి ఊపుమీదున్న నాని -జెర్సీ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. క్రికెట్ నేపథ్యంలో సాగనున్న సినిమాలో -ఓ స్పెషల్ సాంగ్‌కు ఆదా ఓకే చెప్పిందని టాక్. ఆమధ్య సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో మంచి పాత్ర చేసినా -ఆదాకు ఎందుకో కాలం కలిసి రావడం లేదు. వరుసగా తెలుగు, తమిళం, హిందీ భాషలో ఏదోక సినిమా ఆఫర్ వస్తున్నప్పటికీ, ‘లీడ్’ హీరోయిన్‌గా ఈ భామకు చాన్స్ దక్కడం లేదు. దీంతో హీరోయిన్ పాత్రలకు ట్రయిల్స్ వేస్తూనే, ఐటమ్ సాంగ్స్‌కీ ఓకే చెప్పేస్తోందని అంటున్నారు. నానీతో కలసి జెర్సీలో చేయబోయే ఐటమ్‌సాంగ్ కనుక వర్కౌటైతే, ఆదా ఇక ఆ దారిలోనే ముందుకెళ్లే అవకాశాలూ లేకపోలేదు. ప్రస్తుతం ఆదా శర్మ కల్కి చిత్రంలో రాజశేఖర్‌తో జోడీ కట్టింది. గరుడవేగ చిత్రం హిట్టుతో కల్కిపైనా అంచనాలు ఉండటంతో, కొత్త ప్రాజెక్టు తనకూ కలిసొస్తుందన్న నమ్మకంతో కనిపిస్తోంది ఆదా. మరోపక్క బాలీవుడ్‌లో కమాండో-3, బైపాస్‌రోడ్ చిత్రాల్లోనూ ఆదా ముఖ్యమైన పాత్రలు చేయబోతోంది.