ట్రైలర్‌లో మిర్రర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనాథ్, హరిత జంటగా శ్రీ మల్లికార్జున మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రం మిర్రర్. సీ యువర్ సెల్ఫ్ అనేది ఉప శీర్షిక. చిత్రానికి ఏక్మా సాయికుమార్ దర్శకత్వం వహించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యాన్ని సినిమా ఇతివృత్తంగా ఎంచుకున్నారు. స్ర్తిని గౌరవించాలని చెప్పే సందేశంతో మిర్రర్ సినిమా రూపొందింది. చిత్ర ట్రైలర్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు విడుదల చేశారు. అందరికీ నచ్చే సినిమాను చేయాలని సూచించారు. జాగ్రత్తగా చిత్రాన్ని పూర్తిచేసి విడుదల చేసుకోమని ఆయన చిత్ర బృందానికి సూచింస్తూ, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దర్శకుడు ఏక్మా సాయికుమార్ మాట్లాడుతూ నేడు దేశమంతా అలుముకున్న సామాజిక సమస్యను చిత్రంలో చూపిస్తున్నాం. స్ర్తిలకు భద్రత కరువైన రోజుల్లో మనమున్నాం. తెరకెక్కే ప్రతి చిత్రంలో ప్రజలకు పనికొచ్చే ఇతివృత్తం ఉండాలని ఆలోచించి రాసుకున్న కథ ఇది. ఒక ఊరిలో వరుసగా యువతీ యువకుల ఆత్మహత్యలు జరుగుతుంటాయి. వాటికి కారణం ఏమిటని అనే్వషిస్తూ సాగే కథాంశమిది. అందరిలో పెద్దమనిషిగా చెలామణీఅయ్యే కొందరు అసాంఘిక శక్తుల అసలు రూపాన్ని బయటపెడుతుంది సినిమా. వాణిజ్య విలువలున్నా, ఎక్కడా అశ్లీలత కనిపించకుండా ప్రేక్షకులను ఆలోచింపచేసేలా సినిమాను రూపొందించాం. ప్రస్తుతం మిర్రర్ సినిమా సెన్సార్ వినా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ పూర్తిచేసి త్వరలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. సినిమాను మార్చి చివరివారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం’ అన్నారు.