వెరీ ‘రొమాంటిక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో ఆకాష్‌పూరి హీరోగా పరిచయమైన తొలి సినిమా ‘మెహబూబా’తోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ‘రొమాంటిక్’ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈమేరకు నిర్మాతలు టైటిల్ ప్రకటించారు. ఈరోజే సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం కాగా, హీరో కళ్యాణ్‌రామ్, సీనియర్ నటి రమాప్రభలు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. చిత్రం తొలి సన్నివేశానికి హీరో కళ్యాణ్‌రామ్ క్లాప్‌కొట్టారు. నూతన దర్శకుడు అనిల్‌పాదూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ ఈరోజునుంచి జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ఆకాష్ సరికొత్త లుక్, స్టైలిష్‌గా కనిపించనున్నాడు. రొమాంటిక్ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న సినిమాకి పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడం విశేషం. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ ఏడాదిలో ఈ బ్యానర్‌నుంచి వస్తున్న రెండో సినిమాకాగా, రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ జరుపుకుంటుంది.