ఎనర్జిటిక్.. దేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీ, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవ్’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 14న సినిమా విడుదల కానున్న చిత్రానికి దర్శకుడు రజత్ రవిశంకర్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్‌కుమార్ నిర్మిస్తున్న సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగగా చిత్ర బృందం హాజరైంది. ఈ సందర్భంగా దర్శకుడు రజత్వ్రిశంకర్ మాట్లాడుతూ దేవ్ సినిమాలో హీరో క్యారక్టర్ అందరికీ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన నిర్మాత లక్ష్మణ్‌కు ధన్యవాదాలు. సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి. అడ్వెంచర్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా ఇంత బాగా రావడానికి కృషిచేసిన టీంకి కృతజ్ఞతలు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. సినిమాకి పనిచేసిన అందరు టెక్నీషియన్స్‌కి కృతజ్ఞతలు అన్నారు. నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ కార్తీతో చాలారోజుల నుంచి అనుబంధముంది. కార్తిలాంటి హీరోతో ఇలాంటి ఫీల్‌గుడ్ సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. హీరోయిన్ రకుల్ చక్కని అభినయం కనబర్చింది. దర్శకుడు రజత్ స్క్రిప్ట్‌లో ఏంచెప్పాడో స్క్రీన్‌పై అదే చూపించాడు. హారిస్ జయరాజ్ వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. హీరో కార్తీ మాట్లాడుతూ, ప్రజెంట్ జనరేషన్ జోనర్‌లో సినిమా చేయాలనుకున్నాను. దేవ్ సినిమా ఇప్పటి జనరేషన్‌లో ఉన్నవారికి సరిగ్గా సూటవుతుంది. అందమైన కథ దేవ్, అంతా కనెక్ట్‌అవుతారు. మేఘన పాత్రకు రకుల్ పర్‌ఫెక్ట్ యాప్ట్. రెండు వేర్వేరు ఆలోచనలున్న వ్యక్తుల మధ్య లవ్ ఎలాంటి సమస్యలు తెచ్చిందన్నదే కథ. డిఫరెండ్ కథచేసిన ఫీలింగ్‌తో కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను, సినిమా తప్పకుండా హిట్టవుతుంది. మళ్ళీ సక్సెస్ మీట్‌లో అందరినీ కలుస్తా అన్నారు.