‘నీకోసం’ ఓ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమకథలకు సీజన్ ఉండదు. మనసుపెట్టి చేసిన కథలు ప్రేక్షకుల మనసును గెలుచుకుంటాయి. ఆ నమ్మకాన్ని కలిగిస్తున్న సినిమా నీకోసం. ట్రెండ్‌కు తగ్గట్టుగా అప్‌డేట్ అవుతూ దర్శకులు ఈ కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు తీస్తున్నారు. అలా న్యూఏజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నీకోసం’. రెండు జంటలమధ్య ప్రేమకథను ఈ తరానికి నచ్చేలా తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గకుండా ప్రేమకథలో ఓ కొత్తకోణాన్ని ఆవిష్కరించబోతోన్న చిత్రం టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా నీకోసం చిత్రంలోని తొలి పాటను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ‘తొలి తొలిగా’ అంటూ సాగే పాటకు మంచి స్పందన వచ్చింది. పెళ్లిచూపులుతో నేషనల్ వైడ్‌గా గుర్తింపుతెచ్చుకున్న రాజ్ కందుకూరి నీకోసం రెండో పాటను ‘మొదలయ్యింది ఇలా ఎలా’ పాటను విడుదల చేశారు. న్యూఏజ్ లవ్‌స్టోరీగా ఈ మూవీ లుక్ ఉందని ప్రశంసించారు. లవ్‌స్టోరీలో ఎమోషన్‌కు ఎప్పుడూ ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటి ఎమోషనల్ టచెస్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుందీ చిత్రంలో. ఇది ప్రేమకథే అయినా అన్నివర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే అన్ని అంశాలూ ఉంటాయి. ఇక తీర్థసాయి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్లూరమ్మ (్భరతి) నిర్మిస్తోన్న చిత్రానికి అవినాష్ కోకటి దర్శకుడు. ఇప్పటికే టాకీపార్ట్ పూర్తిచేసుకున్న చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది యూనిట్. ప్రేమలో సున్నితమైన ఎమోషన్స్ టచ్ చేస్తూ, భిన్నమైన కోణాలను స్పృశించబోతోన్న చిత్రంలో అరవింద్‌రెడ్డి, శుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షిత ప్రధాన జంటలుగా నటిస్తున్నారు.