పాతాళభైరవి తీయాలని ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం పరిశ్రమలో పరిస్థితులు బాగాలేవు. ఒకరకంగా చెప్పాలంటే బ్యాడ్ పొజిషన్‌లో వుంది అని అంటున్నారు నిర్మాత సి.కల్యాణ్. వరుసగా సినిమాలను నిర్మిస్తూ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సి.కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో...
మంచి సినిమా
ఈ పుట్టిన రోజుకు ప్రత్యేకత ఏంటంటే, లోఫర్ అనే ఓ మంచి సినిమా తీశామన్న ఫీలింగ్ వుంది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రతిఒక్క ప్రేక్షకుణ్ణి కదిలిస్తుంది. ముఖ్యంగా ఆడియో తరువాత చాలామంది మా అమ్మ ఫొటో సెల్‌ఫోన్‌లో పెట్టుకుంటున్నామని, ఇందులో పాట అద్భుతంగా వుందని చెబుతుంటే చాలా ఆనందంగా వుంది. ఇంత మంచి పాట రాసిన అశోక్ తేజకు థాంక్స్.
పరిస్థితులు బాగాలేవు
ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితులు బ్యాడ్‌గా వున్నాయి. దీని గురించి హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరూ ఆలోచించాల్సిన అవసరం వుంది. ఈ పరిస్థితులను మనమే చక్కదిద్దుకోవాలి. అలాగే ప్రస్తుతం ప్రొడక్షన్ బాగా పెరిగిపోవడంతో సినిమాలు తీయడమే కష్టంగా వుంది. ఈ పరిస్థితిని తెచ్చింది కూడా మనమే. అనవసరంగా రెమ్యూనరేషన్లు పెంచేసి సినిమాలు చేస్తున్నారు. అప్పట్లో రెమ్యూనరేషన్లు సినిమా బడ్జెట్‌లో 20 శాతం వుండేవి. ఇపుడు 30 శాతం సినిమా మేకింగ్‌కోసమే ఉపయోగిస్తున్నారు. మిగతా 70 శాతం రెమ్యూనరేషన్లకే పోతోంది. ఈ పరిస్థితి మారకుంటే ఎవరి సినిమా వారే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
చందమామతో గుర్తింపు
నా కెరీర్‌లో నిర్మాతగా చాలా సినిమాలు చేసినా చందమామ సినిమా నిర్మాతగా మంచి గుర్తింపునిచ్చింది. నేను చేసిన సినిమాలు ఏవీ అట్టర్‌ప్లాఫ్ కాలేదు. నా మొదటి సినిమా ‘శ్రీమతి రావే’తో ప్రారంభించి ఇప్పటికి లోఫర్ సినిమాతో 59 సినిమాలు చేశాను.
రామానాయుడు స్ఫూర్తి
నాకు రామానాయుడుగారంటే చాలా స్పూర్తి, ఇష్టం కూడా. ఆయనలాగే వంద సినిమాలు చేయాలని వుంది. దాంతోపాటు సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నాలుగు భాషల్లో ఓల్డేజ్ హోమ్స్‌ని ఫైవ్‌స్టార్ లెవెల్లో ఏర్పాటుచేయాలని వుంది. దానికోసం ఇప్పటికే తమిళనాడు సి.ఎం జయలలితతో మాట్లాడటం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఏర్పాటుచేస్తాం.
పాతాళభైరవి
నాటి క్లాసికల్‌గా నిలిచిన ‘పాతాళభైరవి’ సినిమాను మళ్లీ తీయాలని వుంది. అమ్మ టైటిల్‌తో దాన్ని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమాతో థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది.
తదుపరి చిత్రాలు
‘లోఫర్’ చిత్రాన్ని ఈనెల 17న విడుదల చేస్తున్నాం. ఈ సినిమాతోపాటు పూరి జగన్నాధ్‌తో సినిమాలు చేస్తా.
దాంతోపాటు వినాయక్ దర్శకత్వంలో మరో సినిమా, అలాగే శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో సినిమా చేస్తాను. దాంతోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో వుంటుంది. ఇప్పటికే మంచు మనోజ్‌తో చేసిన అటాక్ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.
*