90ఎంఎల్ బ్యూటీ ఓవియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ బిగ్‌బాస్‌తో అత్యంత గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ఓవియా. బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్‌తో తమిళ సినీ పరిశ్రమలో మంచి ఆఫర్లు దక్కించుకుంటోంది. తాజాగా ఈమె చేసిన 90ఎంఎల్ అనే బోల్డ్ కంటెంట్ చిత్రం ట్రైలర్ విడుదలైంది. సినిమాలో హద్దూ పద్దూ లేకుండా ముద్దు సీన్లు చేసేసింది. కేవలం ఓవియా మాత్రమే కాకుండా మరో ముగ్గురు నలుగురు ముద్దుగుమ్మలూ చిత్రంలో కనిపిస్తారు. చిత్రం ప్రస్తుతం తమిళనాట పెద్ద సంచలనంగా మారింది. మొన్నటివరకు ఈ చిత్రం గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోలేదు. కాని ట్రైలర్ విడుదలైన తర్వాత బోల్డ్ కంటెంట్ కారణంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఓవియాతోపాటు ఇతర ముద్దుగుమ్మలు కూడా ఫుల్ స్కిన్‌షోతో పాటు లిప్‌లాక్ సీన్స్ చేయడంతో సినిమాపై యూత్ ఆడియెన్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐదుగురు అమ్మాయిలమధ్య సాగే కథతో చిత్రం ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక చిత్రంలో తమిళ స్టార్ హీరో శింబు గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఓవియా చిత్రం తమిళనాట మరో సంచలనంగా మారడం ఖాయం.