సెన్సార్‌కు మళ్లీమళ్లీ చూశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయవౌతున్న చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కె కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శే్వత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సినిమా విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు సాయిదేవ రామన్ మాట్లాడుతూ ప్రేమకు ప్రకృతితోడైతే ఎంతో అందంగా ఉంటుందన్న కానె్సప్ట్‌తో తీసిన సినిమా ఇది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ఎసెట్స్. సినిమా ప్రారంభంనుంచి నిర్మాత ఎంతో సపోర్ట్‌చేస్తూ వచ్చారు. నిర్మాణాంతర కార్యక్రమాలు ముగిసాయి. త్వరలోనే సెన్సార్‌కు వెళ్లనుందన్నారు. నిర్మాత కోటేశ్వరరావు కె మాట్లాడుతూ మనస్సుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రం ‘మళ్లీమళ్లీ చూశా.’ అనుకున్న దానికంటే బెటర్ ఔట్‌పుట్ వచ్చింది. సెన్సార్ ముగించి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.